Health Benefits : ఇలా చేస్తే అధిక బరువు అనేక రకాల వ్యాధులు మటుమాయం.. తినేటప్పుడు ఇవి పాటించండి
Health Benefits : గుండె జబ్బులు, డయాబెటిస్, కీళ్లనొప్పులు, అధికరక్తపోటు…ఇలా అనేక రకాల వ్యాధులు రావడానికి మూలకారణం స్ధూలకాయం. ఆహారం అధికంగా తీసుకోవడం, జంక్ పుడ్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక జత్తిడి, స్త్రీలలో హార్మోన్ సమతుల్యత దెబ్బతినడం, హైపోథైరాయిడిజం, కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్యంగా ఇలా చాలా రకాలుగా స్థూలకాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది.స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం […]
Health Benefits : గుండె జబ్బులు, డయాబెటిస్, కీళ్లనొప్పులు, అధికరక్తపోటు…ఇలా అనేక రకాల వ్యాధులు రావడానికి మూలకారణం స్ధూలకాయం. ఆహారం అధికంగా తీసుకోవడం, జంక్ పుడ్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక జత్తిడి, స్త్రీలలో హార్మోన్ సమతుల్యత దెబ్బతినడం, హైపోథైరాయిడిజం, కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్యంగా ఇలా చాలా రకాలుగా స్థూలకాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది.స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువే.స్థూలకాయం వల్ల ఆర్థరైటిస్, శ్వాస సంబంధ సమస్యలు రావచ్చు.
ఒక వ్యక్తి స్థూలకాయంతో బాధపడుతున్నాడని నిర్జారించడానికి బాడీమాస్‌ఇండెక్స్ ఉపయోగపడుతుంది.అధిక బరువు, ఊబకాయం వ్యక్తుల్లో స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువ. స్లీప్ అప్నియా అంటే.. నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా శ్వాస ఆగిపోయి, మృతి చెందడాన్ని స్లీప్ అప్నియా అంటారు. ఊబకాయం వల్ల లివర్ కి కూడా ప్రమాదమే. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అధిక బరువు ఉన్నవారిలో వస్తుంది. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. అధిక కొవ్వు కాలేయాన్ని దెబ్బతీస్తుంది.అధిక బరువు టైప్ 2 డయాబెటిస్‌కు కూడా దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే టైప్ 2 మధుమేహం వస్తుంది.కాలక్రమేణా ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
Health Benefits : డయాబెటిస్ కి దారితీస్తుంది..
ఊబకాయం మధుమేహం ముప్పును 5-6 శాతం పెంచుతుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లవల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా నివారించవచ్చు.అయితే పప్పుధాన్యాలు, బీన్స్ ప్రోటీన్ ఫైబర్ కు సంబంధించిన మంచి వనరులు. ఇవి కేలరీలు తీసుకోవడం తగ్గిస్తాయి. అధిక ఫైబర్, తక్కువ కేలరీలు ఆకు కూరలలో కనిపిస్తాయి. ఇది ఆకలి అనుభూతిని తగ్గిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్‌తో పాటు గింజల్లో కూడా అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.తక్కువ నిద్ర ఆకలిని తగ్గించే హార్మోన్‌ను తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. నిద్ర తక్కువగా ఉన్నప్పుడు, ఆకలిని తగ్గించే లెప్టిన్ అనే హార్మోన్ స్రావం తగ్గుతుంది. అదే సమయంలో, ఆహారం-జీర్ణమయ్యే హార్మోన్ గ్రెలిన్ పెరుగుతుంది.