Health Benefits : మట్టికుండలో నీళ్లు ఆరోగ్యమే కాదు.. ఐశ్వర్యం కూడా ఎందుకంటే..
Health Benefits : ఈ ఎలక్ట్రానిక్ యుగంలో రీఫ్రిజిరేటర్లు, వాటర్ ప్యూరిఫయర్స్ వంటివి వచ్చాక కుండల వాడకం తగ్గిపోయింది. ఒకప్పుడు చల్లని నీళ్లు కావాలంటే ఇంట్లో కుండలను ఏర్పాటు చేసుకుని తాగేవారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఎక్కువైంది. అందుకే ఫ్రిజ్ వాటర్ తాగి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఫ్యూరీఫయర్ పేరిట ఎన్నో కూలింగ్ ఫిల్టర్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎక్కువగా వీటి వాడకానికే ఆసక్తి చూపుతున్నారు. ఒక్కడో ఒక చోట తప్పితే మట్టి కుండలను చూడటం అరుదుగా కనిపిస్తోంది. అలాగే మరోవైపు కొంత మంది మట్టి పాత్రలపై మక్కువ చూపిస్తున్నారు.
ఒకప్పుడు అన్ని వంటలు మట్టిపాత్రల్లోనే చేసుకునేవారు. నీళ్లు నిల్వ చేసుకోవడానికి కూడా పెద్దపెద్ద పాత్రలు వాడేవారు. రానురాను వీటి వాడకం తగ్గిపోతుంది. అయితే మరోవైపు మట్టి పాత్రల వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వాటర్ తాగడానికి యూస్ చేసే బాటిల్స్ కూడా మట్టితో తయారు చేసి అమ్ముతున్నారు. అలాగే మట్టితో తయారు చేసిన ఆకర్షణీయ వంట పాత్రలు కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్, ఇతర పాత్రలతో ఆరోగ్యం పాడవుతుందని వీటిని ఆశ్రయిస్తున్నారు.అయితే మట్టి కుండ వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని, కానీ మట్టి కుండలు వాడటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు.
ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం మట్టి కుండలను ఇంట్లో వాడేటప్పుడు ఎక్కడ ఉంచితే సంపద లభిస్తుందో తెలపబడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..వాస్తు శాస్త్రం ప్రకారం మట్టి కుండను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. అలాగే గ్రహ దోశాలను నివారించడానికి మట్టి పాత్రలను వాడితే మంచి జరుగుతుంది. అలాగే కొత్త కుండ తేగానే నీళ్లు నింపి చిన్నపిల్లలకు ఇస్తే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. అంతే కాకుండా మట్టికుండను ఉత్తరం దిశకు ఉంచితే ఆర్థికంగా బలపడి కుబేరుడి అనుగ్రహం పొందుతారు. మట్టికుండలోని నీళ్లు తాగితే ఇంట్లో సభ్యుల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడతాయిని వాస్తు శాస్త్రం చెబుతోంది.