Health Benefits : వందేళ్లు ఆరోగ్యంగా జీవించేలా చేసే ఈ చెట్టు గురించి మీకు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : వందేళ్లు ఆరోగ్యంగా జీవించేలా చేసే ఈ చెట్టు గురించి మీకు తెలుసా?

Health Benefits : మన హిందూ సంప్రదాయాల ప్రకారం రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తాం. ఎన్నెన్నో పూజలు, వ్రతాలు చేస్తూ.. ముడుపులు, తొట్లెటు కడుతుంటాం. కేవలం పూజలు, పునస్కారాలే కాకుండా ఎన్నో సమస్యలను తొలగించే ఆయుర్వేద మందుల్లోనూ దీనిని ఉపయోగిస్తుంటారు. రావి చెట్టులో ఉన్నన్ని మంచి గుణాలు మరెందులోనూ లేవని కూడా చెప్తుంటారు మన పెద్దలు. అలా పుట్టిందే… రావి చెట్టు లేని ఊరు, వేప చెట్టు లేని వీధి ఉండకూడదనే సామెత వచ్చింది. అయితే […]

 Authored By pavan | The Telugu News | Updated on :4 April 2022,3:00 pm

Health Benefits : మన హిందూ సంప్రదాయాల ప్రకారం రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తాం. ఎన్నెన్నో పూజలు, వ్రతాలు చేస్తూ.. ముడుపులు, తొట్లెటు కడుతుంటాం. కేవలం పూజలు, పునస్కారాలే కాకుండా ఎన్నో సమస్యలను తొలగించే ఆయుర్వేద మందుల్లోనూ దీనిని ఉపయోగిస్తుంటారు. రావి చెట్టులో ఉన్నన్ని మంచి గుణాలు మరెందులోనూ లేవని కూడా చెప్తుంటారు మన పెద్దలు. అలా పుట్టిందే… రావి చెట్టు లేని ఊరు, వేప చెట్టు లేని వీధి ఉండకూడదనే సామెత వచ్చింది. అయితే రావి చెట్టును అనేక ఆయుర్వేద మందుల్లో వాడి అనేక రకాల రోగాలను తగ్గించారు మన పూర్వీకులు. మన పురాణ గ్రంథాల్లో కూడా రావి చెట్టు వల్ల కల్గే ఉపయోగాల గురించి వివరించారు.

ఎన్నో అద్బుతమైన గుణాలు కల్గి ఉన్న ఈ చెట్టు అన్ని బాగాలు కఫ, పిత్త మరియు వాత దోషాల వచ్చే సమస్యలను తొలగిస్తుందట.రావి చెట్టు ఆకులు ఒక కఫహరమైన, మూత్ర విసర్జన, లేపనం వలె పని చేస్తాయి. ఈ ఆకుల రసం తాగడం వల్ల వికారం తగ్గుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదండోయ్ రావి ఆకుల వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగవుతుంది. గోధుమ రంగులో, చిక్కగా మరియు ముట్టుకోవడానికి కఠినంగా ఉంటుందీ చెట్టు బెరడు. అయితే రావి బెరడులో విటామిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఈ బెరడు రసాన్ని డల్ స్కిన్ టోన్ పై అప్లై చేస్తే.. ఛాయను సమతుల్యం చేస్తుందట. అలాగే గాయాలు, పిగ్మెంటేషన్. మెటిమలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

health benifits of banyan tree leaves juice

health benifits of banyan tree leaves juice

అయితే ఒక రోజులో 2400 కిలోల ఆక్సిజన్ ను విడుదల చేసే ఈ చెట్టు కింద వేకువజామున గడపడం వల్ల ఆస్తమా సమస్యలు తగ్గిపోతాయట. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రోగాలు నయం అవుతాయట.సేక్రెడ్ ఫిగ్ అని కూడా పిలువబడే ఈ రావి చెట్టు పండు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ రసాలను ప్రేరేపించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఆకలి లేకుండా ఉండే వారు ఊదా రంగులో పండిన రావి పండ్లను తినడం వల్ల ఆకలి వేస్తుంది. అయితే ఒక గిన్నెలో రావి ఆకులను తీస్కొని వేడి చేయాలి. వెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆకులు రసాన్ని స్వరిస్తాయి. ఈ రసాన్ని రెండు లేదా మూడు చుక్కలు చెవిలో వేయడం వల్ల చెవి నొప్పి తగ్గుతుందట. తాజా నిమ్మరసం, నెయ్యితో రావి చెట్టు బెరడు బూడిదను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గజ్జి, తామర, దురద వచ్చే చోటు రాయడం వల్ల ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది