Beetroot Benifits : ఈ జ్యూస్ ఉదయాన్నే ఒకే ఒక గ్లాస్ తాగండి…ఇక ఈ సమస్యలన్నీ పరార్…?
ప్రధానాంశాలు:
Beetroot Benifits : ఈ జ్యూస్ ఉదయాన్నే ఒకే ఒక గ్లాస్ తాగండి...ఇక ఈ సమస్యలన్నీ పరార్...?
Beetroot Benifits : చాలామంది బీట్రూట్ జ్యూస్ అంటేనే ఇష్టపడరు. ఈ బీట్రూట్ జ్యూస్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలిస్తే మాత్రం.. తాగని వారు కూడా తాగాల్సిందే. ఈ బీట్రూట్ జ్యూస్ ని పిల్లలైతే అస్సలు తాగరు. తాగనని మారం చేస్తుంటారు. కానీ పిల్లలు పెద్దలు బీట్రూట్ రసాన్ని తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే బీట్రూట్ రసం తీసుకోవడం వల్ల మలబద్ధకం,ఉబ్బకాయం అలసట వంటి సమస్యలు పోతాయి. ఈ బీట్రూట్ జ్యూస్ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…
ఈ బీట్రూట్ లో భూగర్భంలో పండిస్తారు. ఈ బీట్రూట్ పోషకాలు భూగర్భంలో దాగి ఉన్న పోషకాలు. మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే బీట్రూట్ జ్యూస్ ని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Beetroot Benifits : ఈ జ్యూస్ ఉదయాన్నే ఒకే ఒక గ్లాస్ తాగండి…ఇక ఈ సమస్యలన్నీ పరార్…?
బీట్రూట్ దుంపల జాతికి చెందినవి. ఈ బీట్రూట్లో ఖనిజాలు,విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోగాలు దూరం చేయటంలో సహాయపడతాయి. బీట్రూట్లను అనేక విధాలుగా తీసుకోవచ్చు.. కూరగా, చట్నీగా, సలాడ్ గా లేదా జ్యూస్ లా తీసుకోవచ్చు. ఇంకా కొన్ని రకాల వంటకాలలో కూడా తయారు చేస్తారు. కొంతమంది బీట్రూట్ ని అస్సలు ఇష్టపడరు. బీట్రూట్ లో ఉన్న పోషక విలువలు తెలిసినవారైతే తప్పకుండా ఆహారాన్ని అలవాటు చేసుకుంటారు. బీట్రూట్ వల్ల మలబద్ధకం ఉబ్బకాయo,అలసట వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరాన్ని బలంగా మారుస్తుంది.
Beetroot Benifits బీట్రూట్లో లభించే పోషక విలువలు :
బీట్రూట్ లో,ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాల్షియం వంటివి అనేక పోషకాలు ఉన్నాయి. పేరు పది గ్రాముల బీట్రూట్ తింటే మీకు 43 మిల్లీ గ్రాముల, క్యాలరీలు, 2 గ్రాముల కొవ్వు మాత్రమే లభిస్తుంది. అంటే శరీర బరువు కూడా పెరగదు. శరీరం అభివృద్ధికి చాలా ముఖ్యమైన పోషకం. అలాగే ప్రోటీన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. బీట్రూట్లో బీటా లైన్లతో పాటు విటమిన్ సి,ఐరన్, పొటాషియం, ఫొలెట్,ఫైబర్, డైటరీలు ఉంటాయి. అయితే ప్రతిరోజు కూడా బీట్రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం…
Beetroot Benifits బీట్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :
. బీట్రూట్ తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. దీన్ని సూపర్ ఫుడ్ గా కూడా వైద్యులు పేర్కొన్నారు.
. బీట్రూట్లో సహజంగానే చక్కెరలను కలిగి ఉంటుంది. ఈ మన శరీరానికి శక్తిని అందించడంలో పనిచేస్తుంది.దీనితో అలసట దూరమవుతుంది.
. బీట్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని రక్షిస్తుంది. రూట్ జ్యూస్ సలాడ్ లేదా పచ్చిగా తిన్నా కూడా చాలా ప్రయోజనం ఉంటుంది.
. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటే మీరు బీట్రూట్ సలాడ్ని లేదా బీట్రూట్ జ్యూస్ ని తాగడం వల్ల బీపీ కొద్దిగా అదుపులోకి వస్తుంది.
. మలబద్ధకం పొట్ట సమస్యలతో బాధపడే వారికి బీట్రూట్ తప్పనిసరిగా తీసుకోవాలి. బీట్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కావున జీర్ణక్రియ మెరుగుపడుతుంది తద్వారా బరువు కూడా తగ్గవచ్చు.
. తింటే రక్తం కూడా శుద్ధి చేయబడుతుంది. అలాగే రక్తహీనత సమస్య దూరమవుతుంది. ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది.
. తరచూ అలసట లేదా బలహీనతకు గురయ్య వారు బీట్రూట్, ఒక దివ్య ఔషధం.
. అలాగే బీట్రూట్ జ్యూస్ అందానికి కూడా చాలా ముఖ్యమైనది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది ముఖం పైన అద్భుతమైన మెరుపునుతేస్తుంది.
జ్యూస్ ఉదయం తీసుకుంటే చాలా మంచిది,ఒకవేళ అలా తీసుకోలేక పోతే రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు.