Diabetes : ఈ నీరు తాగండి….డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోండి…
Diabetes : ఇప్పటి మన జీవనశైలీ చాలా మారిపోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మనం రోజు తినే ఆహార నియమాలు చాలా మారిపోయాయి. రుచి కోసం ఆహారాన్ని వివిధ రకాలుగా వండుకుంటున్నాం. అందుకే అనేక రోగాల బారిన పడుతున్నాం. అందులో ఒకటే డయాబెటిస్. వయసు పైబడిన వారే కాదు,యువతరం కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ ని నియంత్రించడానికి వివిధ చర్యలు తీసుకుంటుంటాం. ట్యాబ్లెట్స్ ను కూడా వాడుతుంటాం. ఇప్పుడు మనం సింపుల్ గా చక్కెర వ్యాధిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం.
షుగరు బాధితులకు జిలకర్ర నీరు ఒక మంచి ఔషధం అని వైద్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ నీరు మన శరీరంలోని డయాబెటిస్ ను కంట్రోల్ లో వుంచుతుంది. రోజు ఉదయాన్నే జిలకర్ర నీరు ను తీసికోవాలి. ఇలా రోజు తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో వుంటుంది. జీలకర్రలో ఫైబర్ శాతం ఎక్కువగా వుంటుంది. కనుక ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇంకా ఈ నీటిని తాగడం వలన చాలా ఉపయోగాలు వున్నాయి. అవి ఎంటో తెలుసుకుందాం.
ఈ జీలకర్ర నీరు డయాబెటిస్ బాధితులకే కాదు స్థూలకాయులు బరువు తగ్గడానికి కూడా బాగా వుపయోగపడుతుంది. అలాగే జీలకర్ర అజీర్తి,యసిడిటి,ఉబ్బరం,కడుపునొప్పికి దివ్యఔషధంలా పని చేస్తుంది. హైబీపి వున్నవాళ్లు జీలకర్ర నీరు తాగితే బీపి కంట్రోల్ లో వుంటుంది.అలాగే మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివలన పేగు సమస్యలు దూరమవుతాయి. అందుకే రోజు పరిగడుపున జీలకర్ర నీరు త్రాగండి.