TEA : ఎక్కువగా టీ తాగుతున్నారా !అయితే మీరు యూరిక్ యాసిడ్ బారిన పడినట్టే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TEA : ఎక్కువగా టీ తాగుతున్నారా !అయితే మీరు యూరిక్ యాసిడ్ బారిన పడినట్టే…

 Authored By rohini | The Telugu News | Updated on :23 June 2022,7:00 am

TEA : మనం తీసుకునే ఆహారంలోని మార్పుల వలన మన శరీరంలో యురిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది కీళ్ళ మధ్యలో ఎక్కువగా ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ ఉన్నవారిలో కీళ్ళ వాపులు, పాదాలు బాగా ఉబ్బుగా ఉండడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ముఖ్యంగా ఈ యూరిక్ యాసిడ్ రావడానికి కారణాలు మనం తీసుకునే ఆహారంలో మాంసాహారాలు ఎక్కువగా ఉండడం వలన న యూరిక్ యాసిడ్ వస్తుంది. మరియు టీని పదేపదే తాగడం వలన , గౌట్ వ్యాధిన పడుతున్నారు. ఈ వ్యాధి కిడ్నీ ని డ్యామేజ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ పాలతో టీని చేసుకొని తాగడం వలన యూరిక్ యాసిడ్ వస్తుంది.

పాలలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. దానివలన యూరిక్ యాసిడ్ త్వరగా వస్తుంది. అదేవిధంగా గా పంచదారను ఎక్కువగా వాడడం వలన బరువు పెరుగుతారు. యురీక్ ఆసిడ్ ఎక్కువగా ఉన్న బాధితులు చక్కెర తీసుకోవడం వలన ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అని నిపుణులు చెబుతున్నారు. యురిక్ యాసిడ్ ఉన్నవాళ్లు నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. పాదాలలో విపరీతమైన నొప్పి వస్తుంది. నడుస్తుంటే ప్రాణం పోయినట్టు గా ఉంటుంది. మనం తినే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటే దాని వలన యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్లు టీ ను తీసుకోవద్దు. ఇలా తీసుకోవడం వల్ల యురిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి టీ మరవలేని వారు గ్రీన్ టీ తీసుకోండి.

Health Problems Drinking TEA in Uric Acid Problem

Health Problems Drinking TEA in Uric Acid Problem

TEA  : టీ తాగడం వలన యూరిక్ యాసిడ్ వస్తుందా..

గ్రీన్ టీ తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే గ్రీన్ టీ మన శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగేలా చేస్తుంది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే యూరిక్ యాసిడ్ ని తగ్గించడం లో గ్రీన్ టీ ముందు ఉంటుంది. ఈ గ్రీన్ టీ యూరిక్ యాసిడ్ ఉన్న వారు ఎక్కువగా మాంసాహారం తీసుకోకుండా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా పుచ్చ గింజలు, మొలకలు, పప్పులు ఇలాంటివన్నీ కి దూరంగా ఉంటూ టీ ,కాఫీలను మానేసి ప్రతి రోజూ గ్రీన్ టీ ని త్రాగండి. ఇలా త్రాగడం వలన యూరిక్ యాసిడ్ ను తొందరగా తగ్గించుకోవచ్చు.

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది