Magnesium Deficiency : శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. రక్తనాళాలు ముడుచుకుపోయి ఈ సమస్యలు వస్తాయి…
ప్రధానాంశాలు:
Magnesium Deficiency : శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. రక్తనాళాలు ముడుచుకుపోయి ఈ సమస్యలు వస్తాయి...
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మెగ్నీషియం పుష్కలంగా ఉండే పదార్థాలని తీసుకోవాల్సి ఉంటుంది..
శరీరంలో విటమిన్లు తక్కువ అయితే శరీర ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో.. లవణాలు తక్కువైన ఆరోగ్యం కూడా అలాగే దెబ్బతింటుంది. ఆహారంలో తగినంత మెగ్నీషియం లేకపోతే మధుమేహం, మూత్రపిండా వ్యాధి ఎన్నో సమస్యలు కొన్ని రకాల మందులు ఈ లోపానికి కారణం అవుతాయి.
Magnesium Deficiency : శరీరంలో విటమిన్లు తక్కువ అయితే శరీర ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో.. లవణాలు తక్కువైన ఆరోగ్యం కూడా అలాగే దెబ్బతింటుంది. ఆహారంలో తగినంత మెగ్నీషియం లేకపోతే మధుమేహం, మూత్రపిండా వ్యాధి ఎన్నో సమస్యలు కొన్ని రకాల మందులు ఈ లోపానికి కారణం అవుతాయి. మెగ్నీషియం లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నీరసంగా, అలసటగా, గుండె దడగా బలహీనంగా అనిపించడం కళ్ళు మసకబారినట్లు ఉండడం కండరాల్లో నొప్పి, తిమ్మిరి ఆందోళన, నిద్రలోపాలు, జ్ఞాపకశక్తి తగ్గడం, రక్తపోటు పెరగడం ఆహారాన్ని మింగడానికి ఇబ్బంది కలగడం.
తలనొప్పి, నిద్రలేమి సమస్యలు రావచ్చు.. అయితే శరీరంలో మెగ్నీషియం శాతం బాగా లోపించి ఉండొచ్చు. తగినంత మెగ్నీషియం శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. ఇది శరీరంలో సరిపడినంత లేనప్పుడు కణాల్లో క్యాల్షియం శాతం పెరుగుతుంది. దాని ఫలితంగా ప్రధానమైన హార్మోన్లు న్యూట్రల్ ట్రాన్స్మిటర్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కొంత సమయం తర్వాత రక్తనాళాలు బాగా ముడుచుకుపోయి తలనొప్పి ప్రారంభమవుతుంది. మెగ్నీషియం పరిమాణం బాగా తక్కువైతే బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఎక్కువవుతుంది. దానివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది.
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మెగ్నీషియం పుష్కలంగా ఉండే పదార్థాలని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామిడి పళ్ళు, తోటకూర, గసగసాలు, ద్రాక్ష, చేపలు, బంగాళాదుంపలు అన్ని రకాల చిరుధాన్యాలు తప్పకుండా తినాలి. అప్పుడు తలనొప్పే కాదు నిద్రలేమితో బాధపడుతున్న కూడా ఆ బాధ నుంచి సులభంగా బయటపడతారు. కుప్పింటాకు రసం ఒక కేజీ నీళ్లు కలపకుండా తీసింది. మంచి నవ్వుల నూనె ఒక కేజీ ఈ రెండింటిని ఒక పాత్రలో కలిపి పొయ్యి మీద పెట్టి చిన్న మంటపైన నిదానంగా ఆకు రసం అంత విగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి. తర్వాత పాత్రను దించి చల్లార్చిన తర్వాత కొంచెం వడపోసుకుని ఈ తైలాన్ని కొంచెం గోరువెచ్చగా తలకు అంటుకుని స్నానం చేస్తూ ఉంటే తలపోటు తలదిమ్ము త్వరగా తగ్గిపోతాయి…