Health Problems : కూల్ వాట‌ర్ తాగితే ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Problems : కూల్ వాట‌ర్ తాగితే ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..?

Health Problems : సాధార‌ణంగా ఎక్కువ‌గా నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిద‌ని చ‌లా మందికి తెలుసు. కానీ.. వాట‌ర్ ఎలా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి.. ఎందుకు తీసుకోవాలి అని ఇలా చాలానే డౌట్లు ఉంటాయి. చాలా మంది దాహం వేయ‌గానే వెంట‌నే కూల్ వాట‌ర్ బాటిల్ మొత్తం తాగేస్తారు. వాట‌ర్ ఎక్కువ‌గా తాగాన‌ని ఫీల్ అవుతారు. అయితే కూల్ వాట‌ర్ తాగితే అనారోగ్యానికి దారితీస్తుంద‌ని తెలియ‌దు. కూల్ వాట‌ర్ వాట‌ర్ తాగితే అప్ప‌టివ‌ర‌కు హాయిగానే అనిపించినా ఇది […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 May 2022,7:40 am

Health Problems : సాధార‌ణంగా ఎక్కువ‌గా నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిద‌ని చ‌లా మందికి తెలుసు. కానీ.. వాట‌ర్ ఎలా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి.. ఎందుకు తీసుకోవాలి అని ఇలా చాలానే డౌట్లు ఉంటాయి. చాలా మంది దాహం వేయ‌గానే వెంట‌నే కూల్ వాట‌ర్ బాటిల్ మొత్తం తాగేస్తారు. వాట‌ర్ ఎక్కువ‌గా తాగాన‌ని ఫీల్ అవుతారు. అయితే కూల్ వాట‌ర్ తాగితే అనారోగ్యానికి దారితీస్తుంద‌ని తెలియ‌దు. కూల్ వాట‌ర్ వాట‌ర్ తాగితే అప్ప‌టివ‌ర‌కు హాయిగానే అనిపించినా ఇది బాడీని కూల్ చేయ‌లేదు. పైగా ఎన్నో వ్యాధుల‌ను ప్రేరేపిస్తుంది. అలాగే చాలా మంది దాహం వేయ‌గానే కూల్ డ్రింక్స్, చ‌ల్ల‌ని జ్యూస్ లు తాగేస్తుంటారు.

ఇవి కూడా అంత మంచివి కావ‌ని నిపుణులు సూచిస్తున్నారు.అయితే స‌మ్మ‌ర్ లో చాలా మంది ఫ్రిజ్ వాట‌ర్ కే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తారు. కానీ ఈ వాట‌ర్ చాలా ప్ర‌మాదం. కుండ‌లో నీళ్లుగానీ, లేదా సాధార‌ణ ఉష్టోగ్ర‌త‌లో ఉన్న‌ వాట‌ర్ తీసుకుంటే మంచింది. ఇంకా అవ‌స‌ర‌మ‌నుకుంటే గోరువెచ్చ‌ని వాట‌ర్ తీసుకుంటే మరీ మంచిది. ఎందుకుంటే ఇది కొలెస్ట్రాల్ పెర‌గ‌కుండా చూస్తుంది. కూల్ వాట‌ర్ తో పొట్ట‌ని నింపేస్తే ఆహారం తొంద‌ర‌గా జీర్ణం కాదు. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. అంతేకాకుండా అధిక‌బ‌రువుకి కార‌ణం అవుతుంది.అలాగే కూల్ వాట‌ర్ ఎక్కువ‌గా తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ పాడ‌వుతుంది.

Health Problems is to Drink Cool Water

Health Problems is to Drink Cool Water

గొంతునొప్పి వంటి ప్రాబ్లంమ్స్ క్రియేట్ చేస్తుంది.అలాగే కూల్ వాట‌ర్ తాగితే త‌ల‌నొప్పి కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంద‌రు బోజ‌న చేసిన వెంట‌నే వాట‌ర్ తాగేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం జీర్ణ‌మ‌వ‌డంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే బోజ‌నం చేసిన అర‌గంట త‌ర్వాత వాట‌ర్ తాగాలి. అలాగే బోజ‌నం చేసే అర‌గంట ముందు నీళ్లు తీసుకోవాలి. మొత్తంగా ప్ర‌తిరోజు నాలుగు లీట‌ర్ల‌కు పైగా వాట‌ర్ తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే శ‌రీరంలోని మ‌లినాలు,టాక్సిన్స్ చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు పంప‌బ‌డ‌తాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది