Health Problems : మొబైల్ ను జేబులో పెట్టుకుంటున్నారా… అయితే ఈ సమస్య మిమ్మల్ని వేధించినట్లే…
Health Problems : ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ప్రతి ఒక్క పనిని ఫోన్లోనే చేసుకుంటూ ఉంటున్నారు. ఆఖరికి తినే ఆహార పదార్థాలను కూడా ఈ ఫోన్ ల ద్వారా ఇంటి వద్దకు రప్పించుకుంటున్నారు. మరీ చిన్నపిల్లలు అయితే మొబైల్స్ కు బాగా బానిసలు అయిపోయారు. ఫోన్ ఉంటేనే అన్నం తింటామనే పరిస్థితికి దిగజారారు. మరికొందరైతే రెండు, మూడు మొబైల్స్ ను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇలా ఫోన్లను ఎక్కువగా వాడటం ద్వారా ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. అందులో ఒకటే తలనొప్పి సమస్య. ఇప్పుడు చాలామందికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది.
ఈ తలనొప్పికి, మొబైల్ వాడటానికి ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే రెండు రకాలుగా తలనొప్పి వస్తుందని తెలిసింది. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎక్కువగా మొబైల్స్ ను వాడటం వలన మనపై ప్రభావం చూపెడుతుంది. అలాగే ఇంటర్నెట్ వాడినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వస్తుంది. మనం ఎక్కువగా ఇంటర్నెట్ ను వాడినప్పుడు ప్రభావం చూపెడుతుంది. అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ బ్రెయిన్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది బ్రెయిన్ కణాలను ఎక్కువగా వేడి అయ్యేలా చేస్తుంది. ఎప్పుడైనా మనం బ్రెయిన్ హీట్ కి గురైనప్పుడు ఎక్కువగా ఆవలింతలు రావటం, ఒత్తిడిగా అనిపించడం, నొప్పిగా, అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండవదిగా మొబైల్స్ ఎక్కువగా వాడినప్పుడు వాటి నుండి వెలువడి రేడియేషన్ వలన మన బ్రెయిన్ లో ఉండే రక్తనాళాలు సంకోచం చెందుతాయి.
ఇలా సంకోచం జరిగితే బ్రెయిన్ కణాలకు రక్తప్రసరణ అనేది ఆగిపోతుంది. ఇలా రక్తనాళాల సంకోచం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు కారణాలతో చాలామంది లో తలనొప్పి రావటానికి కారణం అవుతున్నాయి. అలాగే ఫోన్ రేడియేషన్ వలన డిఎన్ఏ బలహీనపడే అవకాశం ఉంది. అలాగే బలహీనంగా ఉన్న డిఎన్ఏ నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ రేడియేషన్ పడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్స్ కూడా రెండు ఒకేసారి పెట్టుకోకూడదు. ఏదో ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. అలాగే బ్రెయిన్ హిట్ ను తగ్గించడానికి మంచినీళ్లను ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు తలస్నానం చేయాలి. వీలైతే ప్రాణాయామం కూడా చేయాలి. ఇలా చేస్తే బ్రెయిన్ హీట్ వెంటనే తగ్గిపోతుంది. దీని వలన తలనొప్పి రాకుండా ఉంటుంది.