Health Problems : మీరు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా… అయితే మీ ఎముకలు డేంజర్ లో పడినట్లే…
Health Problems : మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఉరుకుల, బేరుకుల జీవితం మూలంగా కొంతమంది సరియైన ఆహారాన్ని తీసుకోకపోవడం నీరు తాగే విషయంలో అశ్రద్ధ చేయడం లాంటి వాటి వలన, ప్రస్తుతం చాలామందికి సహజంగా ఎముకలు, కీళ్ల నొప్పులు ఒక సమస్యగా మారింది. కొంతమంది సరియైన ఆహారం తీసుకోకుండా ఏది దొరికితే అది తింటూ సర్దిపెట్టుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఎముకలలో బలం బలహీనమైతాయని, అలాగే మోకాళ్ల నొప్పులు వస్తాయని వైద్య రంగం వారు తెలియజేస్తున్నారు. మారుతున్న జనరేషన్తోపాటు మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. చాలామంది ఇప్పుడు బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇటువంటి బయట జంక్ ఫుడ్స్ తీసుకోవడం వలన మన శరీరానికి ఎటువంటి పోషక ఆహారాలు అందడం లేదు.
అలాగే విరుద్ధంగా మన శరీరానికి చెడుని చేస్తున్నాయి. ఈ విధంగా వ్యాధుల బారిన పడటంతో పాటు బోన్స్ కూడా వీక్ అయిపోతున్నాయి. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కొన్ని పదార్థాలను తినడం ద్వారా ఎముకలలో గుజ్జు అరిగిపోయి ఇంకా బలహీనంగా తయారవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో ఎటువంటి పదార్థాలను చెక్ పెట్టాలి. అవి ఏంటి.? అనే విషయాలను మనం ఇప్పుడు చూద్దాం స్వీట్స్ కి ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకలకు అస్సలు శ్రేయస్కరం కాదు. అలాగే ఆసియా పసిఫిక్ జనరల్ ఆఫ్ క్లినిక్ న్యూట్రిషన్లో ఆధ్యాయం ప్రకారంగా స్వీట్స్ ఎక్కువగా తీసుకునే వారికి బోన్స్ బలహీనంగా మారే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
అలాగే చికెన్ చాలా మంది చికెన్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ చికెన్ అధికంగా తీసుకోవడం వలన ఎముకలలో కాల్షియం తగ్గడం మొదలవుతుంది. ఈ విధంగా ఎముకలను కూడా పాడయ్యేలా చేస్తుంది. కెఫిన్: ఈ కెఫిన్ అధికంగా తీసుకోవడం వలన బోన్స్ సాంద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. బోన్స్ లో బలం తగ్గిపోయి బలహీనంగా మారుతాయి. శరీరంలోని క్యాలుష్యాన్ని కెఫిన్ బయటికి నెట్టేస్తుంది. సోడా: సోడా చాలా హానికరమే నని అందరికీ తెలిసిన విషయమే. దీనిని తీసుకోవడం వలన ఎముకలు కి హాని కలిగిస్తాయి. అలాగే మహిళల్లో తోటి బోన్స్ ప్యాక్చర్ సమస్యను పెంచుతుంది. అలాగే ఎముకలు బలహీనంగా కూడా మారుతాయి. కాబట్టి వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం మంచిది.