Health Problems : పుట్టగొడుగులు అధికంగా తీసుకుంటున్నారా.? అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే…
Health Problems : పుట్టగొడుగులు అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పొటాషియం, కాపర్ ,సెలీనియం, ఐరన్, విటమిన్ డి ,బి అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో నిత్యం తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే వీటిని అధికంగా తీసుకుంటే ఇక డేంజర్ లో పడ్డట్టే అని వైద్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.
అది ఏంటంటే : ఈ పుట్టగొడుగులను అధికంగా తినడం వలన ఆరోగ్య సమస్యలు ఇంకొకటి తలనొప్పి. అందుకే వీటిని అధికంగా తీసుకోకుండా పరిమితిలో మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీటిని అధికంగా తినడం వలన అలసట, నీరసం, గుండెకి సంబంధించిన లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే అసౌకర్యంగా ఉండడంతో పాటు జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయి.
అలాగే ఈ పుట్టగొడుగులను ఎక్కువగా తినడం ద్వారా చర్మానికి సంబంధించిన అలర్జీలు వచ్చే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. కొందరిలో ఇది తీసుకోవడం వలన దద్దుర్లు కూడా వస్తాయి. అలాగే ఆలర్జీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన విరోచనాలు, వికారం, కడుపునొప్పి, వాంతులు కూడా అవుతాయి. అందుకే వీటిని తీసుకునేటప్పుడు పరిమితిగా మాత్రమే తీసుకోవాలి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అలర్జీ జీర్ణ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అసలు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.