Health Benefits : రోజు నాలుగు ఆకులు చాలు.. ఈ సమస్యలు మీ దరి చేరవు…!
Health Benefits : మన భారతీయులు తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొక్కను దైవంతో సమానంగా పూజిస్తారు. తులసి మొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజు ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులను తీసుకోవడం వలన శారీరక సమస్యల నుంచి బయటపడవచ్చు. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీని ఆకులు తింటే పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. తులసి ఆకులను తీనడం వలన జలుబు, దగ్గు, ఒత్తిడి, ఆందోళన, జీర్ణ, ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు.
ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ను నివారించడంలో తులసి ఆకులు బాగా ఉపయోగపడతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా పోతుంది. జలుబును, దగ్గును నయం చేస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. తులసిలో ఉండే పొటాషియం, ఫోలేట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి ఆకులను పరిగడుపున తీసుకుంటే గుండె పదికాలాలు సురక్షితంగా ఉంటుంది. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
జీర్ణక్రియ ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులను నమిలితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరిగడుపున తులసి ఆకులను తింటే మలబద్దకం సమస్య తొలిగిపోతుంది. తులసి ఆకులు జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతాయని నిపుణులు అంటున్నారు. ఒత్తిడితో బాధపడేవారు తులసి ఆకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆకులను తీసుకుంటే ఒత్తిడి ఆందోళన లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిని ఖాళీ కడుపున తినడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.