Health Tips : మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే మీ గోళ్ళలో ఉన్న ఆకారాన్ని బట్టి తెలుసుకోవచ్చు… అది ఎలా అంటే…
Health Tips : ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నారా.. లేదా అనారోగ్యంగా ఉన్నాడా అని తెలుసుకోవడానికి వైద్య నిపుణులు వారి నాలికను వారి చేతి మణికట్టును, కళ్ళను అదేవిధంగా చిన్నపిల్లలైతే మాడు పైన ఇలా చూస్తూ చెక్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు గోర్లు వాటిలో ఉన్న ఆకారాన్ని బట్టి కూడా ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవచ్చని వైద్యనిపుణులు చెప్తున్నారు. అది ఎలాగో మనం ఇప్పుడూ తెలుసుకుందాం.. అయితే మనిషి గోళ్లను చూసి ఆరోగ్యం గా ఉన్నారా లేదా అనేది ఎలా చెప్పవచ్చు ఇప్పుడు మనం చూద్దాం.. కొందరి చేతి వేళ్ళ గోళ్ళ పై తెల్లగా మచ్చలు ఉంటుంటాయి.
ఇంకా కొంతమందిలో అయితే గోళ్లలో రకరకాల రంగులలో ఉంటాయి. అలాగే ఎక్కువ మందికి గోళ్ళపై అర్ధ చక్రాకారంలో ఒక ఆకారం కనిపిస్తుంది. ఈ విధంగా ఆ అర్థ చక్రకారాన్ని లునులా అని పిలుస్తారట. అయితే ఈ ఆకారం అందరికీ ఒకే రకంగా ఉండవు. కొంతమందిలో చిన్నవిగాను ,ఇంకొంత మందిర్లో పెద్దవిగాను కనిపిస్తూ ఉంటాయి. చాలామందికి ఈ లునులా కనిపించవు. అయితే ఈ అర్థ చక్రాకారం గోళ్ళలో పెద్దవిగా కనిపించినప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా అర్థచక్రకారంలో పెద్దగా ఉన్న వారిలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు.
అలాగే ఈ అర్థ చక్రకారంలో ఉన్న చిన్నవిగా ఉన్న వారిలో జీర్ణ శక్తి అనేది తక్కువగా ఉండటం అని నిపుణులు తెలియజే స్తున్నారు. అంటే వారికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని బ్లడ్ సర్కులేషన్ సంబంధించిన వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుందని. వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఈ లునులా ఆకారం లేనివారిలో శరీరంలో పోషకాలు సరియైన పద్ధతులు అందడం లేదు అని తెలియజేస్తుంది. అలాగే రక్తం తక్కువగా ఉన్నట్లు కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా థైరాయిడ్ లో హార్మన్ల అప్ అండ్ డౌన్ లాంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే అధికంగా బరువు పెరిగిపోవడం, మానసిక ఒత్తిడి, జుట్టు రాలడం లాంటి ఇబ్బందులు అన్నీ కూడా వస్తాయి ఈ లునులా లేని వారికి అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.