Health Tips : మీరు ఇష్టంగా చికెన్ తుంటున్నారా.? అయితే ఇటువంటి పొరపాటు మాత్రం అస్సలు చేయకండి..!
Health Tips : చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చికెన్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని ఇష్టపడని వాళ్లంటూ ఎవరు ఉండరు. చికెన్ తో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. ఫ్రైలు, కర్రీస్, తందూరి ,బిర్యాని లాంటి ఎన్నో వెరైటీలను చేస్తూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తినాలనుకుంటే మంచిదే.. అయితే కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదు అన్న విషయం చాలామందికి తెలియదు.. అయితే వాటి గురించి తెలుసుకోవడం ప్రధానం అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. చికెన్ ని కొన్ని పదార్థాల తో కలిపి తినడం వల్ల చెడు ప్రభావం పడుతుందని తెలియజేస్తున్నారు.
ఇది శరీరంలో అలర్జీ అలాంటి వాటికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా త్రీవరమైన వ్యాధులు కూడా కలిగిస్తూ ఉంటుంది. చికెన్ తో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే ప్రమాదమో ఇప్పుడు చూద్దాం…చికెన్, చేప : చేపలు తో చికెన్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చికెన్, చేపలు రెండిట్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ రెండిట్లోనూ ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్ శరీరంపై ప్రతి చర్యకు కారణం అవుతూ ఉంటుంది. దీని వలన అలర్జీ లాంటి సమస్యలతో పాటు శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి చేపలు చికెన్ కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు…
పెరుగు, చికెన్, చల్లని పదార్థాలు : కొందరు ప్రతిదానికి పెరుగు వేసుకొని తింటూ ఉంటారు. సహజంగా పెరుగు రుచిని పెంచుతుంది. ఆరోగ్యానికి కూడా మంచి చేస్తూ ఉంటుంది. చాలా మంది చికెన్ తో పెరుగు కూడా తింటూ ఉంటారు. పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది. కానీ చికెన్ ప్రభావం వేడిగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు చికెన్ పెరుగు కలిపి తీసుకోవడం జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి చికెన్, పెరుగు కలిపి తీసుకోవడం సాధ్యమైనంత వరకు మానుకోవాలని తెలియజేస్తున్నారు..
పాలతో చికెన్ ; చికెన్ పాలతో తీసుకోవడం అస్సలు మంచిది కాదని విషంలా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. చికెన్ పాలు కలిపి తీసుకుంటే శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ కారణంగా శరీరంలో అలర్జీలు సంభవించి అవకాశం బాగా ఉంది. చికెన్ పాలు కలిపి తింటే చర్మ సమస్యలు అధికమవుతాయి. పాలతో చికెన్ తీసుకోవడం వలన చాలామందికి దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.