Health Tips : ఆ వ్యాధులతో ఇబ్బంది పడేవారు చికెన్ తీసుకోవద్దు… కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఆ వ్యాధులతో ఇబ్బంది పడేవారు చికెన్ తీసుకోవద్దు… కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు…

 Authored By aruna | The Telugu News | Updated on :7 September 2022,5:00 pm

Health Tips : చికెన్ అంటే సహజంగా అందరూ ఇష్టపడే తింటూ ఉంటారు. పేస్ట్వల్ ఏదైనా దాన్లో చికెన్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.. చికెన్ తో చేసిన కొన్ని పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఆ చికెన్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడానికి అందరూ ఆతృతుగా ఎదురు చూస్తూ ఉంటారు. చికెన్ శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందజేయడంతో పాటు బోన్స్ స్ట్రాంగ్ గా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది బోన్స్ ఎదుగుదలకు సహాయపడుతుంది. అయితే దీనిలో ఎన్ని ప్రయోజనాలు ఉన్న దీని అధికంగా తీసుకోవడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని గమనించాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

నిత్యము చికెన్ తీసుకోవడం అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని… వైద్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. చికెన్ తెచ్చుకునేటప్పుడు, వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రతి ఒక్కరు చేసే చిన్న తప్పులు మూలంగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ విధానంగా చికెన్ అధికంగా తీసుకోవడం వలన బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని.. దాని ద్వారా బ్లడ్ చిక్కబడుతుందని రక్తనాళాల్లో ప్రసరణ సరిగా జరగక గుండెకి బ్లడ్ పంపింగ్ అవ్వదు. అని దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని తెలియజేస్తున్నారు. చికెన్ లో ఉండే ప్రోటీన్ వలన అధిక బరువు పెరుగుతారు. అందుకే వెయిట్ తగ్గాలి అనుకునేవారు ఈ చికెన్ ను మితంగా తీసుకోవడం మంచిది.

Health Tips people suffering from those diseases should not take chicken

Health Tips people suffering from those diseases should not take chicken

మాంసాహారం ముట్టని వారి కంటే.. మాంసాహారం తినే వారే అధిక బరువు పెరుగుతున్నారని ఓ ఆధ్యాయంలో వెలువడింది. చికెన్ ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టాలంటే.. ఫ్రెష్ చికెన్ తెచ్చుకోవడం, చికెన్ ను మోతాదుగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ మించితే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కిడ్నీల సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి చికెన్ ను తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్య నిపుణులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది