Health Tips : నైట్ దీనిని నోట్లో వేసుకొని పడుకుంటే… ఇక జీవితంలో గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉండవు…
Health Tips : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో గ్యాస్ ట్రబుల్ అనే సమస్యతో ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య ఎంతో వేధిస్తుంది. ఈ సమస్య కొందరికి మలబద్దక రూపంలో చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంకా కొంతమందికి కడుపులో మంట, కడుపుబ్బరం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటిలో ఎన్నో రకాల గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యతో బాధపడేవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ సమస్య తగ్గించుకోవడం కోసం నిత్యము ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు.
వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి పులిస్టాప్ పెట్టేసి.. ఇలా ప్రకృతి మనకి ప్రసాదించిన కొన్ని ఔషధాలను ఉపయోగించడం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించుకోవచ్చు. దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం.. దీనికి కావాల్సినవి సొంటి, తాటి బెల్లం, సైంధవ లవణం, ఈ మూడు ఆయుర్వేద షాపులో మనకి అందుబాటులో ఉంటాయి. దీని తయారీ విధానం చూద్దాం.. ముందుగా సొంటి పొడిని 50 గ్రాములు తీసుకోవాలి, 100 గ్రాముల తాటి బెల్లాన్ని, 20 గ్రాముల సైంధవలవణం ఈ మూడింటిని పొడి లాగా మెత్తగా చేసుకొని దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.
ఈ పొడినీ ఒక అర స్పూను రాత్రి పడుకునే ముందు నోట్లో వేసుకొని సప్పరించాలి. దీని నుండి వచ్చే రసాన్ని కూడా మింగేయాలి. తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా నిత్యము ఒక అర స్పూన్ పొడిని నైట్ అలాగే ఉదయం కూడా తీసుకున్నట్లయితే ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య ఇక జీవితంలో మీకు దగ్గరికి రాదు. ఇంకా ఈ పొడి వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనితో మలబద్ధకం, జలుబు, జీర్ణ సంబంధించిన వ్యాధులన్నిటిని తగ్గిస్తుంది. దీనిని చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు తక్కువ మోతాదులో ఇస్తే మంచిది.