Health Tips : కంటి కింద నల్లటి వలయాలు పోగొట్టే బెస్ట్ క్రీమ్ ఇదే…
Health Tips : కొంతమందికి కంటి కింద నలుపు వస్తూ ఉంటుంది. వీటి వలన ఎంతటి అందంగా ఉన్నవారైనా సరే అంద హీనంగా కనిపిస్తారు. అనేక ట్రీట్మెంట్లు తీసుకుంటారు. కానీ వీటిని ఎక్కువగా వాడితే రోగాలు వస్తాయి. ఇలాంటి నల్లటి వలయాలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం చేసే పనిలో ఒత్తిడి తగిలితే దాని వలన నల్లటి వలయాలు వస్తాయి. ఒత్తిడి కలిగించే హార్మోన్ ఎక్కువగా విడుదల అవడం వలన హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వలన కూడా కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి. వారసత్వం వలన కూడా వచ్చే అవకాశం ఉంది. హార్మోన్లు డిస్టర్బెన్స్ లేదా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వలన కళ్ల కింద నలుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కొంతమందిలో కొన్ని బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాని వలన కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. వయసు పెరగడం వలన కూడా వస్తాయి. వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ వయసు పెరిగే కొద్దీ తినే ఆహారం వలన నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి హైపోథైరాయిడిజం వలన కళ్ళ కింద నలుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోకింగ్ మరియు ఆల్కహాల్ తాగడం వలన కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. డీహైడ్రేషన్ వలన కూడా కళ్ళ కింద నలుపు వస్తాయి. అలాగే కంప్యూటర్స్, లాప్టాప్స్ ఎక్కువగా చూడడం వలన కంటిపై ఒత్తిడి పడి నల్లటి చారలు ఎక్కువగా వస్తాయి.
వీటిలో ఏ కారణం వలన మీకు చారలు వస్తున్నాయో గ్రహించి వాటిలో మార్పులు చేసుకోవడం వలన వాటి నుంచి విముక్తి పొందవచ్చు. అయితే పైపూతగా కరక్కాయను సాన పెట్టే రాయి మీద అరగదీసి ఆ పేస్టును కంటి కింద రాయడం ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గించి నలుపు కూడా తగ్గిస్తుంది. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం చాలా మంచిది మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకుంటూ ప్రాణాయామాలు, మెడిటేషన్ చేస్తూ మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్, సలాడ్స్, ఆకుకూరలు, జ్యూస్ లు వంటివి ఆహారంలో తీసుకోవడం వలన వీటిని తగ్గించుకోవచ్చు.