Immunity power : డెల్ట్రాకాన్, ఒమిక్రాన్ వణికిస్తున్న వేళ.. ఈ హెల్దీ డైట్‌తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుదల..
Immunity power : భారత్‌తో పాటు ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. కొవిడ్ బెడద ఇక ముగిసిందని అనుకునే లోపే మరో వేరియంట్ పుట్టుకొస్తున్నది. తాజాగా ఒమిక్రాన్, డెల్ట్రాకాన్ వేరియంట్స్ పుట్టుకు వచ్చాయి. దాంతో జనం భయపడిపోతున్నారు. కాగా, ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. ఒకవేళ ఒమిక్రాన్ బారిన పడినప్పటికీ దానితో పోరాడటానికి ఇమ్యూనిటీ పవర్ ఉండాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఎటువంటి డైట్ ఫాలో కావాలో తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి వలన జనంలో హెల్త్ కాన్షియస్ నెస్ అయితే బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపైన శ్రద్ధ వహిస్తున్నారు. తాజా కూరగాయలతో పాటు పండ్లను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అదే క్రమంలో వీటిని కూడా భాగం చేసుకోవాలంటున్నారు పెద్దలు. నెయ్యి..ని కంపల్సరీగా తమ ఆరోగ్యంలో భాగం చేసుకోవాలి. హ్యూమన్ బాడీలో హీట్ జనరేట్ చేసే నెయ్యిని కంపల్సరీగా ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.హ్యూమన్ బాడీకి కావాల్సిన విటమిన్ సిని సమృద్ధిగా అందించే ఉసిరి కాయలనూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతీ రోజు ఉసిరి కాయలను కాయలగానో లేదా రసంగానో తీసుకుంటే చాలా మంచిది.
Immunity power : మీ ఆహారంలో వీటిని భాగం చేసుకోండి..
దివ్య ఔషధంగా పిలవబడే రాగులను కూడా కంపల్సరీగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ ను ఇంక్రీజ్ చేయడంతో పాటు డైజేషన్ సిస్టమ్‌ను స్ట్రాంగ్ చేస్తాయి.యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన అల్లంను కూడా ప్రతీ రోజు తీసుకోవాలి. టీలో దీనిని భాగం చేసుకుంటే మంచిది. వంటింట్లో ఉండే దివ్య ఔషధం పసుపు గురించి అందరికీ తెలుసు. మనం తినే వంటకాల్లో కంపల్సరీగా దీనిని భాగం చేసుకోవాలి. పరగడుపున చెంచడు పసుపును గోరు వెచ్చని నీటిలో కలుపుకుని ప్రతీ రోజు తీసుకుంటే చాలా మంచిది. తేనేను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.