Hair Tips : హెల్దీ జుట్టు కోసం ఇలా చేయండి.. ఈ రెమిడీస్ తో అన్ని సమస్యలకు చెక్
Hair Tips : లేడీస్ జుట్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వాళ్ల అందాన్ని పొడవాటి కురులు మంరింత పెంచుతాయి. అయితే ఆడవారికి జుట్టు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. జుట్టు చిక్కు, డ్రై, చిట్లిపోవడం, బ్యాక్టీరియా, చుండ్రు, ఫంగస్, ఇన్ఫెక్షన్స్ పెరగడం వంటివి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యలతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మగవారిలో కూడా జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్యలకు విటమిన్స్, ప్రొటీన్స్ లోపం ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే కాలుష్యం, ఎండ తీవ్రత కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి.
అంతేకాకుండా రెగ్యూలర్ గా వాడే షాంపూలు, కండీషనర్లతో కూడా జుట్టు పాడవుతుంది. అందుకే సహజ పద్దతుల్లో జుట్టు సమస్యలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..సహజంగా లభించే కొన్ని ఆకులు, పలు పదార్థాలతో ఈ రెమిడీస్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.. కొన్ని గోరింటాకు, మందార ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. అలాగే అలోవేరా, ఓ గుడ్డుని కూడా తీసుకోవాలి. ఇంకా బీట్ రూట్ ముక్కలు, పుల్లటి పెరుగు తీసుకోవాలి.. మొదటగా గోరింటాకు, మందరా ఆకులను మిక్స్ పట్టాలి.