Heart Stroke Symptoms : మీరు ఈ సంకేతాలను లైట్ తీసుకుంటే… ప్రమాదంలో పండట్టే…!
ప్రధానాంశాలు:
Heart stroke symptoms : మీరు ఈ సంకేతాలను లైట్ తీసుకుంటే... ప్రమాదంలో పండట్టే...!
Heart stroke symptoms : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము. వీటిలో గుండెపోటు కూడా ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు కూడా చాలా సాధారణ సమస్యగా మారింది. ఈ గుండె పోటు అనేది చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. దీంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దీనిని ముందుగా గుర్తిస్తే ఈ ప్రమాదం నుండి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే గుండె ఆగిపోవడం వలన గుండెపోటు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
ఈ హార్ట్ బ్లాక్ అనేది మూడు దశలలో మనకు కనిపిస్తుంది. మొదటి దశ అంత ప్రమాదకరమైనది కాదు. కానీ మూడవ దశ మాత్రం చాలా ప్రమాదం. కావున గుండెల్లో పై గది నుండి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గుండె కింద ఉన్న గదికి సరిగ్గా అందనప్పుడు హాట్ బ్లాక్ సంకేతంగా మనం గుర్తించాలి. అయితే గుండె ఆగిపోయే లక్షణాలు గనుక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే పెను ప్రమాదానికి దారితీస్తుంది. దీని కారణం చేత ఎంతోమంది చిన్న వయసులోనే తన ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ గుండె పోటు వచ్చే ముందు మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి చాలా సాధారణంగా మరియు ఎంతో సహజంగా ఉంటాయి. కానీ ఇవి మాత్రం గుండెపోటుకు సంకేతాలు అని వైద్యులు అంటున్నారు.
ప్రతినిత్యం చాలామందికి శ్వాస తీసుకోవడం అనేది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది సాధారణ సమస్య భావిస్తారు. కానీ దీనిని సాధారణ సమస్యగా భావించే కన్నా వైద్యులను సంప్రదించడం మంచిది అని అంటున్నారు. అలాగే ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు అని అంటున్నారు. అయితే ప్రతి వ్యక్తి కి మూర్చపోవటం లాంటి సమస్య ఉంటే అది కూడా గుండెపొట్టుకు సంకేతం కావచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇలాంటి టైమ్ లో వెంటనే వైద్యుని సంప్రదించాలి అని అంటున్నారు. అలాగే గుండెల్లో అడ్డంకులు గనక ఏర్పడినట్లయితే చాతిలో నొప్పి రావడం మొదలవుతుంది. ఈ లక్షణాన్ని ఎంతోమంది గ్యాస్ గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి అని నిపునులు అంటున్నారు…