Helth Tips : ఈ చిట్కాలు పాటిస్తే చంక‌ల‌లో న‌లుపు మాయం…. ఇలా ట్రై చేయండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Helth Tips : ఈ చిట్కాలు పాటిస్తే చంక‌ల‌లో న‌లుపు మాయం…. ఇలా ట్రై చేయండి

Helth Tips : చంక‌లు న‌ల్ల‌గా ఉండ‌టం వ‌ల్ల చాలామంది ఇబ్బంది ప‌డుతుంటారు. స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోవ‌డానికి ఎగ ఇబ్బంది ప‌డిపోతుంటారు. చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో బ్లాక్ అండర్ ఆర్మ్స్ ఒకటి. నల్లటి చంకల నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది అండర్ అర్మ్స్ కి డియోడ్రెంట్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు.. దీని వల్ల కూడా చర్మం నల్లగా మార‌డానికి కారణం అవుతుంది. చర్మం రంగు మారడంతో పాటు ఇరిటేషన్ లాంటి […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,5:00 pm

Helth Tips : చంక‌లు న‌ల్ల‌గా ఉండ‌టం వ‌ల్ల చాలామంది ఇబ్బంది ప‌డుతుంటారు. స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోవ‌డానికి ఎగ ఇబ్బంది ప‌డిపోతుంటారు. చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో బ్లాక్ అండర్ ఆర్మ్స్ ఒకటి. నల్లటి చంకల నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది అండర్ అర్మ్స్ కి డియోడ్రెంట్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు.. దీని వల్ల కూడా చర్మం నల్లగా మార‌డానికి కారణం అవుతుంది. చర్మం రంగు మారడంతో పాటు ఇరిటేషన్ లాంటి ఇబ్బందులు కూడా వ‌స్తుంటాయి. ఎక్క‌వ‌గా ఈ స‌మ‌స్య‌తో స్త్రీలు ఇబ్బంది ప‌డుతుంటారు. ట్రెండీ వేర్ దుస్తులు ధ‌రించాలంటేనే భ‌య‌ప‌డుతుంటారు. అయితే షేవింగ్ వల్ల చంకలు నల్లగా మారుతూ ఉంటాయి. షేవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను దూరం చేయ‌వ‌చ్చు. ఎలాంటి క్రీముల అవ‌స‌రం లేకుండా స‌హ‌జ ప‌ద్ద‌తిలో కొన్ని చిట్కాలు పాటించి ఈ స‌మ‌స్య‌ను త‌రిమి కొట్ట‌వ‌చ్చు.

Helth Tips : ఈ ఆరు చిట్కాలు పాటిస్తే…

అయితే మరీ బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకూడదు. అలా వేసుకుంటే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. కాబట్టి వదులుగా ఉండే డ్రెస్సుల‌ను వేసుకోవాలి. అలాగే ఫిట్ గా ఉంటే కూడా ఈ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీర బరువు మరీ ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంది. కాబట్టి బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి. అప్పుడే చంకలు నల్లబడవు. అలాగే కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం.. ఒక స్పూన్ కొబ్బ‌రినూనే, కొంచెం సాల్ట్, వైట్ కోల్గేట్ పేస్ట్ వేసి బాగా క‌లుపుపోవాలి. ఆ త‌ర్వాత ఐదు నిమిషాల పాటు చంక‌ల‌లో అప్ల‌య్ చేయాలి. ఆ త‌ర్వాత నిమ్మ చెక్క‌తో ఐదు నిమిషాల‌పాటు ర‌బ్ చేసుకోవాలి. ఇలా రెగ్యూల‌ర్ గా న‌ల్ల‌గా ఉన్న చంక‌లు తెల్ల‌గా మ‌రిపోతాయి.

Helth Tips Use this tips for black in armpits

Helth Tips Use this tips for black in armpits

అలాగే బియ్య‌పు పిండి, ట‌మాటా జ్యూస్, పెరుగు బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని చంక‌ల‌లో రౌండ్ గా అప్ల‌య్ చేయ‌లి. ఇలా వారానికి రెండు సార్లు చేసిన‌ట్లైతే చంక‌లు సాధార‌ణ చ‌ర్మంలోకి మారుతాయి. అలాగే కీర‌దోస‌కాయ పేస్ట్, కొబ్బ‌రి నూనె, అర స్పూన్ బేకింగ్ పౌడ‌ర్ మిక్స్ చేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఐదు నిమిషాల‌పాటు చంక‌ల‌కు అప్ల‌య్ చేయాలి. అలాగే టామాట ముక్క‌ని చ‌క్కెర పౌడ‌ర్ లో ముంచి చంక‌లో అప్ల‌య్ చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా ఫ‌లితం ఉంటుంది. అలాగే శ‌న‌గ పిండి, ప‌సుపు ఒక్కో స్పూన్ తీసుకోవాలి. ఇందులో నిమ్మ ర‌సం క‌లుపుకొని చంక‌ల‌లో ఐదు నిమిషాల‌పాటు మ‌సాజ్ చేయాలి. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి. ఇందులో ఏ ఒక్క‌టి ఫాలో అయినా స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది