Health Benefits : ఈ ఒక్క ఆకు తింటే చాలు పంటి పురుగులు తొలగిపోవాల్సిందే..!
Health Benefits : జామ కాయ సామాన్యుల నుండి నిరుపేదల పండు. అతి తక్కువ ఖర్చులో దొరికే మంచి పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న పండు. పండుతో పాటు జామ ఆకులు కూడా అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జామ ఆకుల టీ క్యాన్సర్ తో పోరాడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. కొలెస్ట్రాల్ ను సైతం ఈ ఆకులు తగ్గిస్తాయి. తగ్గిస్తుంది మరియు మధుమేహానికి చికిత్స చేస్తుంది.జామ ఆకు టీ బలమైన యాంటీ బాక్టీరియల్ చర్యలను అందిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే, సాధారణ జలుబు మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సాంప్రదాయ ఔషధం ఎండిన ఆకులను ఉపయోగిస్తుంది. ఇంకా, ఇది డెంగ్యూ వైరస్ సంక్రమణ వంటి క్లిష్ట పరిస్థితికి సహాయపడుతుంది.
జామ ఆకుల యొక్క శోథ నిరోధక లక్షణాలు పంటి నొప్పిని పరిష్కరిస్తాయి. మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. పంటి నొప్పిని తగ్గించుకునేందుకు లేత జామ ఆకులను నోట్లు వేసుకుని నమలాలి. ఎందుకంటే వాటిని చూర్ణం చేయడం వల్ల వాటి వాపు నిరోధక లక్షణాలు ఏర్పడతాయి. ఇంకా జామాకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. స్త్రీ లలో రుతుస్రావం యొక్క నొప్పిని తగ్గించడానికి జామ ఆకులు చాలా బాగా పని చేస్తాయి. జామ చెట్టు లేత ఆకులు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. చిన్నప్పుడు చాలా మంది ఈ లేత ఆకుల్లో చింత పండు పెట్టుకుని తినడం గుర్తుండే ఉంటుంది. ఈ ఆకు వల్ల లాభాలు మనకు అప్పుడు తెలియక పోయినా… అలా ఈ జామ లేత ఆకులను తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
జామ ఆకులను తరచూ తినడం వల్లే అనే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె పని తీరుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.ఈ ఒక్క ఆకుతో వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చాలా మంది ఈ ఆకులను నోట్లో వేసుకుని నమలడం ఇష్టం ఉండదు. లేదా ఇంట్లో జామ చెట్టు ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ఈ ఆకులు దొరుకుతాయి. అలాంటి వారు ముదురు జామ ఆకులను తీసుకుని వాటిని నీడలో ఆరనివ్వాలి. ఆకు పూర్తిగా ఎండిపోయాక… దానిని చూర్ణం చేసి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్నా మంచి ప్రయోజనాలే కలుగుతాయి. ఇలా నీళ్లల్లో కలుపుకుని తాగలేని వారు.. ఆ చుర్ణాన్ని చిన్న చిన్న గోళీల మాదిరిగా తయారు చేసుకుని మింగేయ్యాలి. అది లోపలికి వెళ్లాక అది ప్రభావాన్ని చూపడం మొదలు పెడుతుంది.