Green Banana : పచ్చిఅరటితో ఎన్ని లాభాలో… డయాబెటిస్ తో పాటు ఈ సమస్యలకు బెస్ట్ ఎంపిక…!
Green Banana : అరటికాయను ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. ప్రతి సీజన్లోనూ మరియు మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే పండ్లలో ఈ పండు కూడా ఒకటి. అయితే ఎక్కువగా పండిన అరటిపండ్లనే మనం తీసుకుంటాము. కానీ పచ్చి అరటికాయను తినటానికి ఎవరు ఇష్టపడరు. కానీ దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణక్రియ అనేది ఎంతో మెరుగుపడుతుంది. పచ్చి అరటి పండులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను పెరుగుపరచడంలో మరియు మలబద్ధకాన్ని నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది…పచ్చి అరటి పండ్లు తక్కువ గ్లైసోమిక్ సూచికలను కలిగి ఉన్నాయి. అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవు. అయితే మధుమేహం ఉన్నటువంటి వారికి ఈ పచ్చి అరటిపండు అనేది మంచి ఎంపిక. పచ్చి అరటికాయను మన ఆహారంలో చేర్చుకోవటం వలన బరువు నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి అరటిపండులో ఫైబర్ అధికంగా, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
పచ్చి అరటిపండు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇవి రక్తపోటును తగ్గించడానికి మరియు గుండె సమస్యల ప్రమాదాలను నియంత్రించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది… అరటిపండు లాగే అరటికాయ కూడా శరీరంలో ఉన్నటువంటి శక్తి స్థాయిలను పెంచుతుంది. పచ్చి అరటిపండు కార్బోహైడ్రేట్లకు మంచి మూలం అని చెప్పొచ్చు. ఇవి శక్తి స్థాయిలను పెంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. పచ్చి అరటి పండులో ఉండే విటమిన్ సి చర్మానికి ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది చర్మంపై ఉన్నటువంటి ముడతలు మరియు మొటిమలు మరియు మచ్చలను కూడా తగ్గిస్తుంది. చర్మాని యవ్వనంగా ఉంచడంలో కూడా ఈ పచ్చి అరటిపండు అనేది బాగా తోడ్పడుతుంది. అరటి పండులో ఉండే పొటాషియం అనేది శక్తి స్థాయిలను పెంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పచ్చి అరటి పండులో ఉండే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే పండ్లను ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. వీటిని ఉడికించి లేక వేయించి,పులుసులో వేసి చిప్స్ గా కూడా తీసుకోవచ్చు. పచ్చి అరటి పండ్లతో చేసినటువంటి పిండిని కూడా ఎన్నో వంటకాలలో వాడవచ్చు. పచ్చి అరటి పండ్లు తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే. పచ్చి అరటిపండు అధికంగా తినటం వలన కూడా కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని గమనించి తీసుకోవటం చాలా మంచిది. మధుమేహం ఉన్నటువంటి వారు పండ్లను తీసుకునే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే. పచ్చి అరటి పండు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే గుణం కలిగి ఉన్నది. కావున పచ్చి అరటిపండు ఒక ఆరోగ్యకరమైన ఆహారం…