Towels : మనం వాడుకున్న టవల్స్ ని ఎన్ని రోజులకి ఉతకాలి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Towels : మనం వాడుకున్న టవల్స్ ని ఎన్ని రోజులకి ఉతకాలి..!

 Authored By aruna | The Telugu News | Updated on :3 October 2023,8:00 am

Towels : ఉదయం లేచింది మొదలు.. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ముఖ్యంగా వాడే ఒకే ఒక్క వస్తువు టవల్.. అంతేకాదు ఇది చాలా అత్యఅవసరం కూడా.. ఉదయం లేచి మొహం కడిగింది మొదలు ఆఫీస్ కి రెడీ అయ్యేంతవరకు అలాగే చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లేంతవరకు కూడా ఈ టవల్తో పని పడుతూనే ఉంటుంది. ఆ తర్వాత టవల్ ని ఎవరు ఎక్కడ విసిరేస్తారో తెలియదు.. ఇక హాస్టల్స్ లో ఉండేవాళ్లు సింగల్ రూమ్స్ లో ఉండే వాళ్లయితే టవల్ ఎలా వాడతారో వాళ్లకే తెలియాలి. ఎందుకు ప్రత్యేకంగా ఈ టవల్ గురించి చెబుతున్నాను అంటే టవల్ ని మనం ఎలా వాడుతున్నాం. ఎప్పుడెప్పుడు వాష్ చేస్తున్నాం.. ఒకవేళ వాష్ చేయకపోతే ఎటువంటి రోగాల బారిన పడాల్సి వస్తుంది. టవల్ ని ఎలా వాడాలి.. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ తెలుసుకోబోతున్నాం.

మరి ఎంత ముఖ్యమైన విషయాన్ని చూద్దాం.. అయితే రోజు ఉపయోగించే దానిని కొంతమంది రోజు ఉతుకుతుంటారు. మరి కొంతమంది వారానికి ఒకసారి ఉతుకుతారు.. ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా.? సాధారణంగా మనం రోజు వాడే టవల్స్ వారానికి మూడుసార్లు ఉతకడం మంచిది. ఎక్కడికైనా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత స్నానం చేసిన తర్వాత వాడుతూ ఉంటాం. అయితే మనం బయటికి వెళ్లి వచ్చిన తర్వాత వాడిన టవల్ ను మరునాడు ఉతకడం మంచిది. లేకపోతే ఆ టవల్లో క్రిములు మన చర్మానికి హానికలుగా చేస్తాయి. అలాగే మనం ఎప్పుడైనా ఒక టవల్ను కనీసం మూడు రోజులు వాడిన తర్వాత అయినా ఉతకడం మంచిది.

How many days should we wash the used towels

How many days should we wash the used towels

టవల్ను మనం ఏదైనా టూర్ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా.. అలా తీసుకెళ్లిన వాటిని మనం మళ్లీ ఉతికిన తర్వాతే వాడాలి.. లేదంటే ఆ టవర్ లో ఉండే మురికి మన శరీరానికి పడుతుంది. దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. లేని చర్మ సమస్యలు కూడా రావచ్చు.. కాబట్టి మనం ఎక్కడికైనా తీసుకెళ్లిన తర్వాత మరియు మనం ఇంట్లో కనీసం మూడు రోజులు వాడుకున్న తర్వాత కచ్చితంగా ఉతకాలి. ముఖ్యంగా వైట్ టవల్స్ ను బేకింగ్ సోడా ఉపయోగించి శుభ్రం చేయడం వల్ల తిరిగి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. కొత్త టవల్స్ ను శుభ్రం చేయడానికి హాట్ వాటర్ వాడండి. ఈ టవల్స్ ను వేడి నీళ్లలో 25 నిమిషాలు నానబెట్టండి. తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయండి. కొద్దిగా స్క్రబ్ చేయడం వల్ల స్మూత్ గా తయారవుతాయి.

ఇక నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ గానే కాదు.. మీరు నిమ్మరసం ఉపయోగించి టవల్స్ చేత్తో కూడా శుభ్రం చేయొచ్చు.. కేవలం మామూలు టవల్స్ మాత్రమే కాకుండా ఇలా శుభ్రం చేయొచ్చు మురికిపడ్డ టవల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఉప్పును ఉపయోగించడం వల్ల ఎన్నో క్రిములను తొలగిస్తుంది.. మరి చూసారు కదా చిన్న టవలే కదా అని ఈజీగా వదిలెయ్యకండి. ఇదే మనకి ఆరోగ్యమైన, అనారోగ్యమైన కలిగించడానికి ఒక పెద్ద ఆయుధమని మర్చిపోకండి…

Also read

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది