eggs : గుడ్లు వలనే కలిగే ఉపయోగాలు- నష్టాలు.. రోజు ఎన్ని గుడ్లు తినవచ్చు..?
eggs : గుడ్డు అనేది అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్దాల్లో ఒకటి. ఒక గుడ్డు మన శరీరానికి కావాల్సిన అన్ని పోషక పదార్దాలను కలిగివుంటుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. విటమిన్ బి 12, విటమిన్ డి మరియు అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. అయితే, పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల రోజులో ఎక్కువ గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదే విధంగా గుడ్లు ఎక్కువగా తీసుకోవటం వలన కడుపు సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఒక క్రమ పద్దతిలో రోజుకు ఎన్ని గుడ్లు తినాలి. అనేది మనం ఇప్పుడు చూద్దాం.
eggs : కొలెస్ట్రాల్ వలన నష్టంలేదు..?
ఒక రోజులో ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని నమ్ముతారు. గుడ్డు సొనలలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం దీనికి కారణం. ఒక గుడ్డు పచ్చసొనలో సుమారు 200 మిల్లీగ్రాముల (mg) కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజువారీ సిఫార్సు స్థాయి రోజుకు 300 mg కంటే ఎక్కువ కాదు. తాజాగా వచ్చిన అధ్యయనం ప్రకారం శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కంటే ఆహార పదార్దాలు తీసుకోవటం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ తక్కువ ప్రభావం చూపిస్తుందని తెలిసింది. కాబట్టి ఒక గుడ్డు లోని పచ్చసొన తిన్న వచ్చే ఇబ్బంది ఏమి లేదు.
రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు
ఒక రోజులో ఎన్ని గుడ్లు తినవచ్చు అనే దానికి సరైనా సమాధానం చెప్పటం కష్టం. ఇది వ్యక్తికి వ్యక్తికి మరియు వారి మొత్తం ఆరోగ్యానికి భిన్నంగా ఉంటుంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, సగటు ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి ఏడు గుడ్లు వరకు ఎలాంటి లేకుండా తినవచ్చు. మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడకపోతే, రోజులో మూడు గుడ్లు వరకు సులభంగా తినవచ్చు.
గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు అధిక పోషకాలు కలిగి ఉన్నాయి, కాబట్టి ప్రతి ఆహారంలో వాటిని భాగం చేసుకొని తినవచ్చు, కాకపోతే వేసవిలో ఎక్కువ గుడ్లు తీసుకుంటే, శరీరంలో వేడి పెరుగుదలకు అవి కారణం కావచ్చు, ఇది ప్రేగు కదలికలో సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా, ఇది అతిసారానికి కూడా దారితీస్తుంది, ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో. కాబట్టి వేసవిలో వాటిని నియంత్రించడం చాలా ముఖ్యం.
ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో ఖచ్చితంగా ఒక మనిషి ఇన్ని గుడ్లు మాత్రమే తీసుకోవాలని చెప్పే సృష్టమైన ఆధారాలు ఏవి దొరకలేదు. దీనిపై మరెన్నో పరిశోధనలు చేయాల్సి ఉంది. మన పెద్దల కాలం నాటి నుండి కూడా ఏదైనా ఆహారాన్ని మితంగా తినాలని ఎల్లప్పుడూ చెపుతూ వుంటారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవటం కూడా ఒక రకంగా ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి రోజు వారి ఆహారంలో గుడ్డును భాగం చేసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు రోజుకు రెండు చొప్పున గుడ్లు తినవచ్చు.