Health Benefits : సర్వరోగ నివారిణిగా పని చేసే వావిలాకు మొక్క గురించి మీకీ విషయాలు తెలుసా?
Health Benefits : గ్రామాలు, పల్లెల్లో ఉండే వాళ్లకు వావిలాకు మొక్క గురించి తెలిసే ఉంటుంది. సర్వరోగ నివారిణిగా ఈ మొక్కను వాడుతుంటారు చాలా మంది. ముఖ్యంగా ఒంటి నొప్పులు వంటి వాటి నుండి ఉపశమనం కోసం నీటిని కాచి స్నానం చేస్తుంటారు. అలాగే దీనిలో ఉండే కొన్ని రకాల విటామిన్ల వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోతుంది. అలాగే ఈ ఆకుల యొక్క కషాయం శరీరంలో చెడు కొలెస్ట్ర్రాల్ ని తగ్గి బరువు కూడా వేగంగా తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో వావిలాకు పౌడర్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది. ఆ పొడిని కూడా నీటిలో మరిగించుకొని తాగవచ్చు. తాజా ఆకులకు దొరికితే మరింత మంచిది. ఈ మొక్క యొక్క అనాల్జేసిక్, యాంచీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ ఆకుల నుండి తయారు చేసే నూనె వల్ల గాయాలు, అంతర్గత రుగ్మత వల్ల వచ్చే కండరాలు, కీళ్ల నొప్పుల నొప్పి, వాపును తగ్గిస్తుంది. ఇది కాళ్ల పగుళ్లను కూడా నయం చేయడానికి బాగా పనిచేస్తుంది. వావిలాకు ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా అల్సర్ ను నయం చేయవచ్చు.అంతే కాదండోయ్ సంతాన సమస్యలతో బాధపడే చాలా మంది మహిళలకు ఈ వావిలాకు మొక్కలు చాలా ఉపయోగపడతాయి. స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలను మెరుగు పరచడంలో వావిలాకు ప్రత్యేక పాత్ర వహిస్తుంది. అలాగే అనేక రకాల చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా వావిలాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. బొల్లి ల్యుకోడెర్మా మరియు కుష్టు వ్యాధిని మొక్క మరియు గాని ఉత్పత్తులను ఉపయోగించి చికిత్స చేస్తారు.
ఋతుస్రావం ప్రారంభమయ్యే ముందు రోజల్లో మహిళలు తరచుగా తీవ్రమైన మానసిక, శారీరక క్షోభను అనుభవిస్తారు. పీఎమ్ఎస్ యొక్క ఆందోళన, నిరాశ, ద్రవ నిలుపుదల వంటి లక్షణాలను వావిలాకుతో మరింత సాఫీగా పరిష్కరించవచ్చు. ఈ కషాయం జీర్ణ వ్యస్థ యొక్క పనితీరును బలోపేతం చేయడానికి, మెరుగు పరచడానికి సహాయపడుతుంది. ఇది గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. అలాగే ఆకలిని కూడా పెంచుతుంది. జీర్ణక్రియలో సమస్యలు మరియు గ్యాస్ ఏర్పడటానికి బొడ్డు వాపు కారణంగా ఏర్పడే కడుపు నొప్పులో నిర్గుండి మొక్కల సారం ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది.