కరివేపాకుతో ఇలా చేస్తే చాలు.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కరివేపాకుతో ఇలా చేస్తే చాలు.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :4 October 2023,1:00 pm

తెల్ల జుట్టుతో చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటివారు కోరుకునే విధంగా ఒకే ఒక్క సూపర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్యను మనం మరింత పెంచుకుంటున్నాం.. నిజానికి చాలామందికి తినడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయారు. పని తర్వాతే ఏదైనా అన్నట్టుగా తయారైంది. ప మనం చేయాల్సిందల్లా కొంచెం సమయాన్ని కచ్చితంగా అయితే కేటాయించుకోవాలి. ఒక్కసారి ఈ ఆయిల్ మీరు తయారు చేసుకుంటే రెండు మూడు నెలల వరకు మీకు తలకు సంబంధించిన ఎటువంటి రెమెడీస్ తయారు చేసుకోవడం కానీ లేదా మరేతర ప్రోడక్ట్లు వాడాల్సిన అవసరం కానీ రానే రాదు.. ఇక మీరు తల కోసం ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు.

మీ చక్కగా ఆరోగ్యవంతమైన హెయిర్ ని మీరు పెంచుకోవచ్చు. అలాగే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు. మరి ఆ అద్భుతమైన ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమేం కావాలో దీన్ని ఎలా వాడాలి? వాటి ఉపయోగాలు ఏంటి అనే విషయాలు కూడా పూర్తిగా చూసేద్దాం. ఈ సూపర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. అలాగే రెండు స్పూన్ల వరకు కలోన్జి గింజలు, రెండు స్పూన్ల వరకు అవిసెగింజలు, మరో రెండు స్పూన్ల వరకు రైస్ వేసుకోండి. అంటే మీరు రెగ్యులర్ గా ఏ రైస్ అయితే వాడతారో ఆ రైస్ వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ లా చేసేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి మరొక బౌల్ తీసుకోండి.

ఇందులో ఒక పావు లీటర్ వరకు ఆముదం ప్యూర్ గా ఉండేది వేసుకోండి. ఒకవేళ మీకు ఆముదం అవైలబుల్ లేకపోతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా సరే వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా.. ఆ పౌడర్ ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఇంగ్రిడియంట్స్ కలపబోతున్నాం. అవన్నీ కూడా మనందరి ఇళ్లల్లో సర్వసాధారణంగా దొరికేవి.. అవి ఏంటంటే ఒక మీడియం సైజు పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్ లో వేసేయండి. అలాగే ఒక అంగుళం వరకు అల్లం కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్ లో వేసి బాగా కలపండి.

If you do this with curry leaves your white hair will turn black

If you do this with curry leaves, your white hair will turn black…

ఇప్పుడు 5, 6 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్ లో వేయండి. ఇప్పుడు ఆలవెరా తీసుకోండి. ఆరు వరకు ఎండిన మందార పూలు వాడాలి. అలాగే కొన్ని మందార ఆకుల ఐదు ఆరు వరకు కూడా తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసేయండి. ఇప్పుడు ఇక మనం తీసుకునేది కరివేపాకు రెబ్బలు కొన్ని, అలాగే కొన్ని వేపాకు రెబ్బలు కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్ లో వేసేయండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. ఈ ఆయిల్ స్టౌ పై 30 నిమిషాల పాటు ఈ ఆయిల్ మరిగించుకోవాలి. డబల్ బాయిలింగ్ పద్ధతిలో ఆయిల్ ని బాగా మరిగించిన తర్వాత కిందకు దించేసి బాగా చల్లారనివ్వండి.

ఇలా చల్లారిన ఈ ఆయిల్ ని మరొక గాజు సీసాలోకి వడగట్టుకుని స్టోర్ చేసుకుంటే మీరు రెండు మూడు నెలల వరకు ఈ హెయిర్ ఆయిల్ చక్కగా వాడుకోవచ్చు..ఇప్పుడు ఇలా తయారైన ఈ ఆయిల్ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాం.. ఈ ఆయిల్ మీరు ప్రతి రోజు పడుకోడానికి ముందు అంటే ఒక గంట ముందు అయినా రేపు తలస్నానం చేస్తామనగా ముందు రోజు రాత్రి ఈ ఆయిల్ ని కూదుర్లకు బాగా పట్టించండి. ఆ తర్వాత తలంతాటికీ కూడా పట్టించి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని ఆ తర్వాత తెల్లవారు ఉదయం మీరు చక్కగా మంచి షాంపూ అంటే కెమికల్ లేనిది హెర్బల్ షాంపులతో హెయిర్ వాష్ చేసుకోండి. అయితే మీరు ఈ ఆయిల్ ని నెలరోజుల పాటు వారానికి రెండు సార్లు అయినా సరే వాడాల్సి ఉంటుంది. అప్పుడే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది