Green Tea : గ్రీన్ టీ ఇలా తాగితే క్యాన్సర్ వ్యాధికి చెక్…!!
Green Tea : ప్రస్తుతం చాలామంది ఈ క్యాన్సర్ వ్యాధితో భయభ్రాంతులకు గురవుతున్నారు.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వ్యాధులలో మొదటగా గుండెపోటు తర్వాత క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలంటే గ్రీన్ టీ తాగమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. వారి పరిశోధనల ప్రకారం పంచదార, పాలు, టీ ఆకులతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు. అలాగే ఈ హెర్బల్టిని తీసుకోవడం వలన బరువు కూడా తగ్గుతారు. అయితే ఈ గ్రీన్ టీ లో కొన్ని ప్రత్యేకమైన వాటిని కలిపితే వీటి ఉపయోగాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం…
గ్రీన్ టీ ఉపయోగాలు: నిమ్మకాయ : నిమ్మకాయను గ్రీన్ టీ లో కలిపి తీసుకుంటే రుచి కొద్దిగా మారుతుంది. ఈ రెండు కాంబినేషన్ మీ శరీరానికి ఎంతో ప్రభావంతంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు పెంచడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. ఇంకా శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క, పుదీనా ఆకులు : కొంతమంది గ్రీన్ టీ లో దాల్చిన చెక్కను అలాగే పుదీనా ఆకులను కలుపుకొని తాగుతూ ఉంటారు. ఎందుకనగా ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణ క్రియ అని కూడా పెంచుతాయి. ఇది తాగిన తర్వాత చాలాసేపు వరకు ఆకలి ఉండదు. దాని ద్వారా ఈటీవీ తాగిన వారు బరువు కూడా తగ్గుతారు..
స్టీవియా ఆకులు : స్టీవియా ను తెలుగులో మధుపత్రి అని పిలుస్తారు. ఇది గ్రీన్ టీతో కలిపి తీపి యాడ్ అవుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే క్యాలరీలు తగ్గడమే కాకుండా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఇది షుగర్ పేషెంట్లుకు చాలా బాగా సహాయపడుతుంది. అల్లం : ఈ అల్లం వంటకాలలో మసాలా దినుసుగా వాడుతుంటారు. ఆహారం రుచిని పెంచుతుంది. గ్రీన్ టీ లో ఈ అల్లం కలిస్తే ఎన్నో రకాల ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చు. గ్రీన్ టీ లో అల్లం కలిపి తీసుకోవడం వలన శరీరం రోగనిరోధక వ్యవస్థ బలోపితం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా రక్షించవచ్చు..