Kadaknath Chicken : కడక్ నాథ్ చికెన్‌లో ఇన్ని ప్రయోజనాలా.. కొలెస్ట్రాల్ సమస్య ఏ మాత్రం లేదు..!
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటు కోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు…చేదోడువాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో నాటు కోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కడక్ నాథ్ కోడి.. ఖతర్నాక్ అనిపించుకుంటోంది. దాన్ని కోసి వండుకుని తిని జిహ్వ చాపల్యాన్ని తీర్చిందన్న ఉద్దేశ్యంతో ఈ మాట అనడం లేదు. దాని యజమాని ఎలా చెప్తే అలా వింటుండడమే దాని స్పెషాలిటీ. అయితే ఈ కడక్‌నాథ్ కోడి యజమానికి కూడా స్పెషాలిటీ ఉంది.
Kadaknath Chicken : వెరైటీ కోళ్లు..
కరోనా లాక్ డౌన్ వరకు ప్రైవేటు పాఠశాలను నడిపి విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన ఆర్థిక భారం పడడంతో వ్యవసాయం వైపు అడుగులేశారు. ఇందులో భాగంగా వివిధ జాతులకు సంబంధించిన పశు పక్ష్యాదులను కూడా పెంచుతున్నారు. ఇతర జాతుల కోళ్ల కంటే కడక్‌నాథ్ చాలా రుచికరమైన, పోషకమైన, ఆరోగ్యకరమైన, అనేక ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చికెన్‌లో 25 శాతం ప్రొటీన్లు, 1.03 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. చాలా తక్కువ కొలెస్ట్రాల్, అధిక అమైనో ఆమ్లాలు కలిగి ఉండటం వలన దీని వినియోగం డయాబెటిక్, గుండె రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది….
ఇందులో కొవ్వు శాతం 0.73 నుంచి 1.03 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నందున, దీని వినియోగం వైద్యులు సలహా ఇస్తారు. చలికాలంలో దీని వినియోగం మీ శరీరంలో వేడిని నిర్వహిస్తుంది. దీని కారణంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.సాధారణంగా కోళ్లను పిలవాలంటే ‘‘బ్బబ్బబ్బబ్బ’’ అంటూ వాటి యజమానులు పిలుస్తుంటారు. దీంతో అవి తమ యజమాని గొంతు నుండి వస్తున్న కూత విని చకాచకా ఇంటికి చేరుకుంటాయి. కోళ్లకు ఆహారం వేసేప్పుడో.. గంప కింద దాచి పెట్టేప్పుడో కోళ్లను పిలిచేందుకు ఈరకమైన శబ్దాన్ని చేస్తూ ఉంటారు.కడక్‌నాథ్ నల్లగా మారడానికి ప్రధాన కారణం మెలనిన్.ఇండోనేషియా, చైనీస్, భారతీయ మూలానికి చెందిన కడక్‌నాథ్ ఉన్నాయి. వారి నలుపు రంగు కారణంగా, గిరిజన సమాజంలోని ప్రజలు వారిని కలిమాసి అని కూడా పిలుస్తారు.