Health Benefits : ఇవి వాడితే ఏ నొప్పులు మీ దరిచేరవ్.. ఎలా వాడాలో.. తెలుసుకోండి..
Health Benefits : ప్రస్తుత రోజుల్లో డయబెటిస్, కీళ్లనొప్పులు, నడుము నొప్పి అధిక బరువు ఇలాంటి సమస్యలు అందరిలోనూ చాలా సర్వసాధారణం అయిపోయి. వీటిని తగ్గించటానికి రకరకాల మందులు వాడుతుంటాం. అలా కాకుండా కొన్ని సహజ పద్దతులలో ఇంట్లోనే కొన్ని మందులు రెడీ చేసుకోవచ్చు. వీటి ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చు.అయితే వాము, కలొంజి విత్తనాలతో కీళ్ల నొప్పులు లకు చక్కటి పరిష్కారం చూపవచ్చు. వాములో ఫైబర్, అనామ్లజనకాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక బరువు ను తగ్గించి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. సాధారణంగా మనం తినే ఆహారం గుండె ఆరోగ్యం, బరువు, మదుమేహం వంటి ఇతర సమస్యలపై ప్రభావం చూపిస్తుంది.
వాము నమలడం, వేడి నీటితో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.తిన్న ఆహారం అరగకపోతే, త్రేన్పులు, ఏసీడీటీ సమస్య ఉంటే… వాము కలిపిన భోజనం తినాలి. అంతే… ఏం మ్యాజిక్ చేస్తుందో గానీ పొట్టలోని అన్ని సమస్యలూ పరార్ అవుతాయి. ఏ గ్యాసూ లోపల తిష్ట వేయదు. రోజూ 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ వాము, అర టీస్పూన్ అల్లం పొడిని నీటిలో కలిపి తాగితే.. ఛాతిలో మంటలు పోతాయి. కడుపునొప్పిని వాము వెంటనే తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వాములో వేడిని పెంచే లక్షణాలు ఉంటాయి. జలుబు ఉన్నవారు వామును తీసుకుంటే అది వెంటనే తగ్గిపోతుంది.
Health Benefits : ఇలా డ్రింక్ రెడీ చేసుకోండి..
కలొంజి విత్తనాల్లో ముడి ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఐరన్, సోడియం, కాల్షియం ఉంటాయి. కలోంజి విత్తనాలు తేనేతో కలిపి తీసుకుంటే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గ్లాసు నీళ్లలో అర స్పూన్ వాము, అర స్పూన్ కలోంజీ విత్తనాలు వేయాలి. ఇవి మరిగి అరగ్లాస్ అయ్యాక ఈ వాటర్ ను ఫిల్టర్ చేసి రోజు ఉదయాన్నే పడిగడుపున తాగాలి. ఇది ఫ్యాట్ కట్టర్ లా పనిచేసి అధిక బరువు, దానివల్ల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇది రెగ్యులర్ గా వాడితే కిళ్ల నొప్పులు, నడుము, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.