Health Benefits : కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఈ రసం తాగేయండి.. ఇక ఆ సమస్య పరార్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఈ రసం తాగేయండి.. ఇక ఆ సమస్య పరార్

 Authored By mallesh | The Telugu News | Updated on :10 May 2022,8:20 am

Health Benefits : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కిడ్నీల్లో స్టోన్స్ వలన తెగ బాధపడుతున్నారు. వీరందరూ అనేక రకాల పత్యాలు చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అయినా కానీ కొన్ని సార్లు మాత్రం వీరి సమస్యను దూరం చేసుకోలేక పోతున్నారు. వీరు ఈ సమస్య వలన అనేక డబ్బులను వృథాగా ఖర్చు చేసుకోవడమే కాకుండా విలువైన సమయాన్ని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఇలా కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు మనకు సహజంగా దొరికే ఒక చెట్టు రసం తాగితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మనకు విరివిగా లభించే కలబంద రసం తాగడం వలన ఈ సమస్య పరార్ అవుతుందని చెబుతున్నారు. కలబంద అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. జట్టుతో పాటుగా ఫేస్ కోసం కూడా కలబందను వాడుతారు. అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు కూడా ఈ రసాన్ని తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.కలబంద అనేది మంచి యాంటీ యాక్సిడెంట్ గా పని చేస్తుంది. కావున దీనిని ఎటువంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు. కలబంద గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుంటే..

Kidney Stones Problem Health Benefits drink Aloe vera juice

Kidney Stones Problem Health Benefits drink Aloe vera juice

  1. కలబంద రసంలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. కావున ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
  2. రోజుకు రెండు గ్లాసుల కలబంద రసాన్ని తీసుకోవడం వలన కిడ్నీల్లో సమస్యతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు.
  3. కలబందను గోరువెచ్చని నీటిలో కానీ, నిమ్మరసంలో కానీ మిక్స్ చేసి తీసుకోవచ్చు.
  4. డైరెక్టుగా కలబంద రసం తాగబుద్ది కాని వారు దీనిని హనీలో కలుపుకుని కూడా తాగేయొచ్చు.
Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది