Cholesterol : ఈ కొలెస్ట్రాల్ తో ఎన్నో ప్రమాదకర వ్యాధులు… ఇలా ట్రై చేస్తే.. మంచులా కరుగుతుంది…!
Cholesterol : ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అధిక బరువు, ఉబకాయం, కొలెస్ట్రాల్ ఈ సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది ఎన్నో వ్యాధులకి కారణమవుతూ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ వలన గుండెపోటు కరోనరీ వ్యాధి, షుగర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో నిత్యం ఆహారంలో కొన్ని ఆహార మార్పులు చేసుకుంటే ఈ కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
పండ్లు కూరగాయలు తీసుకోవాలి
ఇప్పుడు చాలామంది స్పైసి ఫుడ్, నూనె పదార్థాలు తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. వాటి వలన ప్రమాదకరమైన కొవ్వులు శరీరంలో పెరుగుతాయి. ఇవి ఆరోగ్యానికి చెడు చేస్తాయి. అలాంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం చాలా అవసరం. కొలెస్ట్రాల్లో తగ్గించడానికి ఉపయోగపడే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయలు ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
సుగంధ ద్రవ్యాలు తీసుకోవాలి
కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే మసాలాలు తీసుకోవడం మాత్రం కూడా తగ్గించుకోకూడదు. అల్లం, పసుపు, దాల్చిన చెక్క, వెల్లుల్లి లాంటి సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఆయుర్వేద లక్షణాలు నిండి ఉంటాయి. సిరల్లలో పలకం తగ్గడం మొదలవుతుంది.
సోయాబీన్స్ తీసుకోవాలి
బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపాలి. దీనికోసం నిత్యం ఆహారంలో సోయాబీన్స్ చేర్చుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అనేక నాన్ వెజ్ ఉత్పత్తుల కంటే సోయాబీన్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
గ్రీన్ టీ తాగాలి
నిత్యం తీసుకునే సాధారణ టీ కాఫీలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ని అధికమయ్యేలా చేస్తుంది. దానికి బదులుగా మీరు గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని ఉపయోగంతో బరువు పెరగడానికి బ్రేక్ పడడంతోపాటు చేడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.