Juice : నిత్య యవ్వనంగా కనిపించడానికి ఒక అద్భుతమైన జ్యూస్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Juice : నిత్య యవ్వనంగా కనిపించడానికి ఒక అద్భుతమైన జ్యూస్…!

 Authored By aruna | The Telugu News | Updated on :26 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Juice : నిత్య యవ్వనంగా కనిపించడానికి ఒక అద్భుతమైన జ్యూస్...!

Juice  : వేల సంవత్సరాల క్రితమే మునగాకును మెడిసిన్ లో వాడే వారట. దక్షిణాసియాలో ఇది ఎక్కువగా సాగు చేయబడుతుంది..ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మునగాకు రసాన్ని తాగడం వలన అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. మునగ చెట్టును శాస్త్రీయంగా మోరింగా చేట్టూ అని పిలుస్తారు. విటమిన్ ఏ విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, కాలుష్యం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఎక్కువ శాతం కలిగి ఉన్న మునగాకు రసం తాగడం మంచిది. ప్రతిరోజు మునగాకుల రసం తాగడం వలన పేగుల కదలికలు కలిగి సులువుగా మోషన్ జరుగుతుంది. మునగాకులో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసాన్ని తాగడం వలన నొప్పి వాపు కు ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు మునగాకు జ్యూస్ మూడుసార్లు మూడు నెలలు పాటు తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. షుగర్ లెవల్సింది అదుపులో ఉంచే మునగాకు రసాన్ని ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు.

గుండె జబ్బులు చాతిలో నొప్పి శరీరంలో కొలెస్ట్రాల్ అని పిలిచే చెడు కొలెస్ట్రాల్ దీనికి పరిష్కారం గా మునగాకు రసాన్ని తాగడం శ్రేయస్కరం.ఈ రసాన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను మన శరీరం నుంచి తొలగించవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మునగాకు శరీరానికి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయం పడుతుంది. బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉండడంతో బాక్టీరియా పెరగకుండా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా నివారించే గుణం ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకు జ్యూస్ ప్రతిరోజు తాగడం వలన తాగడం వలన వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. సెల్ డామేజ్ కాకుండా చేసి చర్మం యొక్క స్థితిస్థాపకతను తగ్గిస్తుంది.ముడతలు రాకుండా చర్మం ప్రకాశవంతంగా మరియు యవ్వనంగా కనిపిస్తుంది. మొటిమల సమస్యలను తొలగిస్తుంది. మునగాకు రసాన్ని ప్రతిరోజు తాగడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అలాగే విటమిన్లు మినరల్స్ మెరుగవుతాయి. మునగాకు రసం శరీరంలోని కొలెస్ట్రాల స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా శరీర నిరోధకతను మెరుగుపరుస్తుంది. ఈ మునగాకు జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కొన్ని మునగాకులతో తీసుకొని వాటికి తగిన విధంగా నీటిని కలిపి రసం వచ్చేంతవరకు బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్ లో ఒక స్పూన్ తేనె లేదా నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రసాన్ని తాగడానికి ఇష్టపడని వారు టొమాటో, జిలకర ,మిరియాలు, పసుపు, కొత్తిమీర పొడి కొద్దిగా ఉప్పుతో మునగాకులను కలిపి తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే ఎన్నో వ్యాధులను దూరం చేయవచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది