Hair Tips : దీన్ని షాంపూతో కలిపి జుట్టుకు రాస్తే చాలు… జుట్టు రాలే సమస్య ఇట్టే మాయమవుతుంది!
Hair Tips : మనం తలకి షాంపూ వాడేటప్పుడు దాన్ని నేరుగా తలకు అప్లై చేయకూడదు. దానిలో కొన్ని రకాల పదార్థాలు కలిపి చేయడం వల్ల తల శుభ్ర పడుతుంది. అలాగే కొన్ని రకాల జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కువగా కెమికల్ బేస్డ్ హెయిర్ షాంపూలు ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల తల శుభ్ర పడటం జరుగుతుంది. కానీ కాల క్రమంలో అనేక రాకల జుట్టు సమస్లు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, జుట్టు కణాలు దెబ్బతిని జుట్టు విరగడం వంటి అనేక రకాల సమస్యలను మనం గమనిస్తూ ఉంటాం. అందరికీ హెర్బల్ హెయిర్ షాంపూలు అందుబాటులో ఉండక పోవచ్చు లేదా పడకపోవచ్చు.
కానీ మనం వాడే షాంపూతోనే మంచి జుట్టుని ఆరోగ్యకరమైన స్కాల్ఫ్ పొందడానికి ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలు చాలా బాగా సహాయ పడతాయి.మీరు వాడే షాంపూ అయినా నేరుగా తలకు అప్లై చేయకుండా దాన్ని కొద్దిగా నీటిలో కరిగేలా కలిపి ఈ నీటితో మాత్రమే తల స్నానం చేయాలి. కెమికల్స్ తో నిండి ఉండే షాంపూలు నేరుగా అప్లై చేయడం వల్ల తలలోని జుట్టు కుదుళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉన్న వారు మీరు వాడే ఏదైనా షాంపూలో ఉసిరికాయ రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు నల్లగా కుదుళ్లు నుంచి పెరగడంలో ఇది సహాయ పడుతుంది. అంతే కాకుండా జుట్టు పొడవుగా, బలంగా ఉండేందుకు సహాయ పడుతుంది.

natural shampoo for hair fall and hair growth
ఉసిరికాయతో పాటు భ్రింగ్రాజ్ లేదా గుంటగలగరాకు అని పిలుచుకునే ఈ ఆకు రసాన్ని షాంపూతో కలిపి అప్లై చేస్తే అనేక రకాల జుట్టు సమస్యలు అన్నీ తగ్గుతాయి.తెల్ల జుట్టు సమస్య జుట్టు చివర్లు పగలడం జుట్టు రఫ్ గా ఉండటం వంటి అనేక సమస్యలను తగ్గిస్తుంది. కొంత మందికి తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. అలాంటి వారు వేపాకులను మరిగించిన మీరు లేదా వేపాకుల రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య నుంచి తొలగించుకోవచ్చు. అలాగే దురద, పంగల్ ఇన్ఫెక్షన్, పేలు సమస్యలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ మన జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది.