PCOD : పీసీఓడీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ ఆసనాలు ట్రై చేయండి…!
ప్రధానాంశాలు:
PCOD : పీసీఓడీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా... అయితే ఈ ఆసనాలు ట్రై చేయండి...!
PCOD : ప్రస్తుత కాలంలో మహిళలు అధికంగా మరియు కామన్ గా కనిపించే పాయింట్ లలో పీసీఓడీ సమస్య కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఈ పీసీఓడీ అంటే పోలీసిస్టక్ ఓవేరియర్ సిండ్రోమ్. అయితే ఇది ఒక హార్మోన్ సంబంధించిన సమస్య అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ సమస్య ఉంటే పీరియడ్స్ అనేది సక్రమంగా రాదు. అలాగే బరువు పెరగడం మరియు అప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్ మరియు విసుగు,చిరాకు లాంటివి కూడా వస్తాయి. అయితే ఈ ప్రాబ్లమ్ అనేది అంత ఈజీగా తగ్గేది కాదు. అయితే మీరు ఈ సమస్యను తగ్గించుకోవాలి అంటే వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాక మీరు ఈ ఐదు ఆసనాలు వేశారంటే ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. ఆ ఆసనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
శవాసనం : మీరు శవాసనం వేయటం వలన పీసీఓడీ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే ఈ సమస్య కారణం చేత మనస్సు పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే శవాసనం వేయటం వలన ఒత్తిడి కూడా దూరం అవుతుంది. దీనివల్ల హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి…
బాలాసనం : ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు తొందరగా ఉపశమనం పొందాలి అంటే తరచుగా బాలాసలం కూడా వేయాలి. అయితే మీరు ఈ ఆసనం వేయటం వలన హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి. అలాగే చిరాకు మరియు విసుగు, ఆందోళన లాంటివి కూడా తగ్గుతాయి.
త్రికోణాసనం : ఈ ఆసనం వేయడం వలన కూడా మీరు ఈ సమస్య ను నియంత్రించవచ్చు. ఈ ఆసనం వేయడం వలన ఫెల్విక్ ఏరియాలో వచ్చేటటువంటి నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ ఆసనం వేయటం వలన కొంత శక్తి అనేది మీకు లభిస్తుంది. మీకు త్వరలోనే మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. అందుకే మీరు ఈ ఆసనాలను ట్రై చేస్తే మంచిది…