నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు వచ్చే సమస్యలు ఇవే…!
ప్రధానాంశాలు:
నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు వచ్చే సమస్యలు ఇవే...!
చాలామంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతూ ఉంటారు.. ఇలాంటి పిల్లల్ని ఫ్రీ మెచ్యూర్ బేబీస్ అని పిలుస్తారు.. నెలలు నిండకుండా జన్మించడం వలన వారికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే బరువు తక్కువగా ఉండడం, చాలా వీక్ గా ఉండడం లాంటివి ఉంటాయి. అలాగే వీరు బ్రతకడం కూడా చాలా కష్టమని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు.. అయితే నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చాలా ముఖ్యం.. నెలలు నిండకుండా పుట్టడం వలన పిల్లల శరీరం లోపల ఆర్గాన్స్ అభివృద్ధి ఉండదు. కావున వీరిలో న్యూరో డెవలప్మెంట్ అనేది అసాధారణంగా ఉండవచ్చు… ఇలాంటి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్ని పుట్టగానే వారిని వెంటిలేటర్ మీద ఉంచుతారు.
వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకు వచ్చిన తర్వాత బేబీని తల్లి హత్తుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల తల్లి గుండెచప్పుడు విని ఆ స్పర్శను అనుభవించే అవకాశం ఉంటుంది. దానితో బిడ్డ త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బేబీని ఇన్ఫెక్షన్, అలర్జీ నుంచి కాపాడడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం కూడా చాలా ముఖ్యం. శిశు ఊపిరి పీల్చుకుంటుందో లేదో కూడా మీరు గమనిస్తూ ఉండాలి… ప్రీ మెచ్యూర్ బేబీస్ ఫై తాజాగా ఓ పరిశోధన జరిగింది.. పరిశోధనల ప్రకారం వీరికి మానసిక రుగ్మతలు, వినికిడి సమస్యలు, జీవక్రియ సమస్యలు, రక్తహీనత సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
బేబీస్ కి సుమారు మూడు సంవత్సరాలు వచ్చే అంతవరకు తల్లిదండ్రులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమని చెప్తున్నారు..ప్రసవం తర్వాత సరైన పోషకాహారం లేకపోవడంతో పిల్లల్లో అసహజ నరాల అభివృద్ధికి దారితీస్తుంది. కావున వీరికి మంచి ఆహారాన్ని అందించడం అవసరం. అయితే ఈ పిల్లల్లో ఎదుగుదల కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది.. వీరిలో బలహీనమైన ప్రవర్తన ఉంటుంది. తల్లిపాలు తాగలేరు. శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి.. కాబట్టి వీరిని నెల నెల చెకప్ కి తీసుకెళ్తూ మంచి ఆహారాన్ని ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం…