Heart Attack : బాత్రూంలో ఉన్నప్పుడు గుండెపోటు రావడానికి కారణం ఏంటో తెలుసా…?
Heart Attack : ప్రస్తుత కాలంలో చాలామందికి గుండెపోటు వస్తుంది. ఒకప్పుడు గుండెపోటు అంటే 50 ఏళ్లు పైబడిన వాళ్లకే వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్లు నిండకుండానే గుండెపోటుతో మరణిస్తున్నారు. జీవన విధానంలో మార్పులు, ఆహార విషయాలలో మార్పులు రావడం వలన ఇలా అనేక రకాల కారణాల వలన గుండె సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే వాళ్ళు కూడా గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. ఇక ముఖ్యంగా కొన్ని సందర్భాలలో గుండెపోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది ఎక్కువగా బాత్రూంలో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణిస్తున్నారు. బాత్రూం వెళుతున్న సమయంలో వచ్చే ఒత్తిడి వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగం పెరిగి, అప్పటికే గుండెలోని ధమనుల్లో బ్లాక్స్ ఉన్న వారిలో గుండెపోటు సంభవించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా భారతీయ మరుగుదొడ్ల వలన ఎక్కువ ఒత్తిడి వలన గుండెపోటు వస్తున్నాయని అంటున్నారు. ఆ సమయంలో ఒత్తిడి పెరిగితే అది గుండెకు వెళ్లే ఆక్సిజన్ పై ప్రభావం చూపుతుందంట. దీని ప్రభావం వల్ల గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉందంట.
సాధారణంగా మిగతా సమయాలతో పోలిస్తే ఉదయం పూట రక్తపోటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో చల్లని లేదా వేడి నీటితో స్నానం చేయడం వలన రక్తపోటులో మార్పులు వచ్చే అవకాశం ఉందంట. ఆ కారణం చేత గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే హీరోయిన్ శ్రీదేవి కూడా స్నానం చేస్తున్న సమయంలోనే బాత్రూం టబ్లో మరణించిన సంగతి తెలిసిందే. అందుకనే గుండెపోటును ఇలాంటి సమయాలలో నివారించాలంటే కొన్ని నివారణ మార్గాలు ఉన్నాయి. అవేంటంటే స్నానం చేసేటప్పుడు నీటిని ఒకేసారి శరీరంపై పోసుకోకూడదు. ముందుగా పాదాల పైన పోసుకోవాలి. అంతేకాకుండా బాత్రూంలో ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోకూడదు. ఇలా చేయడం వలన గుండెపోటు సమస్యలను నివారించుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నారు స్నానం చేసేటప్పుడు ఈ నియమాలను పాటించాలి.