Cracked Heels : ఈ ఆకుతో పాదాల పగుళ్లను నిమిషంలో మాయం చేయవచ్చు…!!
Cracked Heels : చాలామంది చలికాలంలో కాళ్ల పగులుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో పాదాల పట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో పాదాల పగుళ్ళ సమస్యను చాలా ఎక్కువగా ఉంటుంది. తేమ పొడిగాలులు సరిగా లేకపోవడం పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా వహించకపోవడం వలన పాదాల పగుళ్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ పాదాల పగుళ్లు సమస్యను తగ్గించుకోవడానికి ప్రస్తుతం మనం చెప్పే ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్య రాకుండా సమస్య తీవ్రం అవ్వకుండానే ఇంటి టిప్స్ తో పాదాల పగుళ్లను నుంచి ఉపశమనం కలిగించుకోవచ్చు. మన ఇంట్లో ఉండే మొక్కలలో పాదాల పగుళ్ళ నుండి బయటపడవచ్చు.
గోరింటాకు, కరివేపాకు రెండు కూడా పాదాల పగుళ్లును తగ్గించడానికి చాలా గొప్పగా పనిచేస్తాయి. అయితే ఈ సమస్యకి కారణం సరియైన పోషకాహారం తీసుకోకూడదు. పెరుగుతున్న వయసు, గట్టి నేల మీద ఎక్కువ సేపు నిలబడడం థైరాయిడ్, మధుమేహం లాంటి సమస్యలు ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ పాదాల పగలు సమస్యలు అధికమవుతున్నాయి. చాలామంది సమస్యను పెద్దగా పట్టించుకోరు. తర్వాత సమస్య తీవ్రమై నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. గోరింటాకు ఆకులను కరివేపాకు ఆకులను సమానంగా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ ఆకులను తాజావి తీసుకోవాలి.
ఆకులు తాజాగా ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు అలాగే గోరింటాకు ఆకులను మెత్తని పేస్టులా పట్టుకోవాలి. ఈ పేస్టులో మర్రిపాలను కలిపి పాదాల పగుళ్లకు అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమం రాత్రి పడుకునే సమయంలో అప్లై చేసి మరునాడు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు పాటు చేస్తే మృదువుగా మారుతాయి. కరివేపాకులో ఉండే విటమిన్స్ పాదాల పగుళ్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గోరింటాకు లో ఉండే పోషకాలు కూడా బాగా అంది పాదాల పగుళ్లు ఉన్న ప్లేస్ లో కొత్త కణాలు అభివృద్ధికి సహాయ పడుతుంది. కాబట్టి ఈ రెండిటిని కలిపి మిశ్రమంలో తయారు చేసుకొని నిత్యం వారం రోజులపాటు రాస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..