Health Tips : శీతాకాలంలో ఉబ్బరం సమస్యతోబాధపడుతున్నారా…ఈ సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!
Health Tips : చాలామందికి చలికాలంలో ఏది తిన్న కూడా కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇటువంటి సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో ఈ సమస్య చాలామందిని బాధిస్తూ ఉంటుంది. కడుపు అంత ఉబ్బరంగా ఉండడం బొడ్డు వద్ద పట్టేసినట్టు, పొత్తి కడుపు వద్ద నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది చలికాలంలో ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఇదే సమయంలో కొంతమంది మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఊబకాయం ఉన్నవాళ్లు సమస్య చెప్పలేనిది ఎక్కువ ఊబకాయం ఉన్నవాళ్లు కడప సమస్యతో ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్లకు పొట్ట పట్టేసినట్టుగా ఉండడం అలాగే ఆకలి లేకుండా అన్ ఈజీగా ఉంటుంది. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ సమస్య కాలానికి సంబంధించింది కాదని చెప్తున్నారు.
అయితే చలికాలంలో ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అని మాత్రం చెబుతున్నారు. పొట్టంతా బిగుతుగా ఉండడం, కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. అని చెబుతున్నారు. అసలు ఈ ఉబ్బరం సమస్య ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళు కి అలాగే పిల్లలు ఉన్న ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కడుపుబ్బరం అనేది చాలా రకాల కారణాలవల్ల వస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చలికాలంలో తక్కువ నీరు తీసుకోవడం వలన డిహైడ్రేషన్ కి గురైతే ఉబ్బరం సమస్య వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా చలికాలంలో వ్యాయామం విషయంలో ఆలస్సత్యంలో ఎక్కువగా నిద్రిస్తూ ఉంటారు. ఈ విధానం వలన ఉబ్బరం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
అదేవిధంగా చలికాలంలో మనం తీసుకునే ఆహారం వలన జీర్ణక్రియ అంతరాయం చెంది ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది టీ, కాఫీలు అధికంగా తీసుకుంటూ ఉంటారు. అధికంగా టీ కాఫీలు తీసుకునే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఉబ్బరం సమస్యకు నివారణ చిట్కాలు.. అతిగా నిద్రపోకుండా రోజంతా యాక్టివ్ గా ఉండాలి. కచ్చితంగా శారీరిక వ్యాయామం చేస్తూ ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలను కూడా తీసుకోవాలి. శీతాకాలంలో శరీరాన్ని అవసరమైన మేరకు నీటిని తీసుకోవాలి. అదేవిధంగా శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేస్తే చాలావరకు ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చు..