Skin Allergy : మీరు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేసి దానికి చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Skin Allergy : మీరు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేసి దానికి చెక్ పెట్టండి…!

 Authored By tech | The Telugu News | Updated on :19 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Skin Allergy : మీరు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేసి దానికి చెక్ పెట్టండి...!

Skin Allergy  : సహజంగా చాలామందిలో స్కిన్ ఎలర్జీ అనే సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్య ఏ వయసు వారికైనా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అనేది నీటిలో మార్పు వలన తీసుకునే ఆహారం మార్పు వలన ఇలాంటి ఎలర్జీ సమస్య వస్తూ ఉంటుంది. ఎండ, పొల్యూషన్ స్కిన్ ఎలర్జీకి కారణం అవుతూ ఉంటుంది. మరీ ప్రధానంగా వేసవి లో ఈ సమస్య ఎక్కువ మందిని బాధిస్తూ ఉంటుంది. సహజంగా చర్మంపై దురద, దద్దుర్లు, ఎరుపు రంగులోకి చర్మం మారడం లాంటి లక్షణాలు స్కిన్ ఎలర్జీలు అధికంగా కనపడతాయి. మొదట్లోనే ఈ సమస్యకు చికిత్స చేయకపోతే ఎలర్జీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఒళ్లంతా పాకే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని రకాల టిప్స్ పాటించడం వలన అలాగే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన స్కిన్ ఎలర్జీ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్కిన్ ఎలర్జీతో ఇబ్బంది పడుతుంటే జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. మార్కెట్లో లభించే కెమికల్ సభ్యులు లేదా క్రిముల వల్ల చర్మం ప్రమాదంలో పడుతుంది.  కావున కఠినమైన సబ్బు మరియు డిటర్జెంట్ అసలు వాడకూడదు. సింథటిక్ దుస్తులను ధరించడం మానుకోవాలి.

సూర్యరశ్మికి ఎక్కువసేపు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. మానసిక ఒత్తిడి కూడా చర్మం ఆరోగ్యం పై ప్రభావం ఎఫెక్ట్ పడుతుంది. కావున మెడిటేషన్, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో మార్పులు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ చర్మ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు..స్కిన్ ఎలర్జీ సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండేలా చూడాలి. కూరగాయలు ,పండ్లు , బీట్రూట్, వాల్ నట్లు లాంటి ఆహారంలో చేర్చుకోవాలి. వీటితోపాటు ఎన్ని ద్రాక్ష ,పెరుగు లాంటి ప్రోబయోటిక్స్ చర్మాన్ని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు ఈజీగా చెక్ పెట్టవచ్చు.

Tags :

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది