Skin Care : ఎగ్జిమా గురించి మీకు ఏమైనా తెలుసా..? అన్ని అలర్జీలు తామర కాదు.. కావున ఎలా తెలుసుకోవాలి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Skin Care : ఎగ్జిమా గురించి మీకు ఏమైనా తెలుసా..? అన్ని అలర్జీలు తామర కాదు.. కావున ఎలా తెలుసుకోవాలి…

 Authored By aruna | The Telugu News | Updated on :29 September 2022,5:00 pm

Skin Care : చాలామందికి చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక వర్షాకాలంలో అయితే ఈ చర్మ వ్యాధులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ వర్షాలకు చర్మ వ్యాధులు కాదు ఎన్నో రకాల జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా చర్మ వ్యాధులు బాగా వస్తూ ఉంటాయి. వర్షాల టైంలో తేమ అలాగే బ్యాక్టీరియా ఎదుగుదల మూలంగా ఈ అలర్జీలు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఎంతోమంది అలర్జీ దురద లాంటి వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని అలర్జీలు ఎగ్జిమా దద్దుర్లు అని అనుమాన పడుతూ ఉంటారు. అయితే తామర కాదు తామర లాంటి లక్షణాలు ఈవిధ రకాల అలర్జీలు రూపంలో సంభవించవచ్చు. కావున దీనికోసం సరియైన ట్రీట్మెంట్ కొరకు ఆ అలర్జీలను క్షుణ్ణంగా పరీక్షించడం చాలా ప్రధానం. అయితే తామర ఇతర అలర్జీల మధ్య తేడాలు ఏంటి.? ఏ విధంగా తెలుసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం…

Skin Care : తామర యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి.?

తామర అనేది చిన్న పిల్లల్లో సాధారణంగా వస్తూ ఉంటుంది. ఈ తామర రెండు రకాలు తడి మరియు పొడి ఫస్ట్ లో చర్మం చాలా పొడిగా అవుతుంది. తదుపరి దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి పొడి తామర యొక్క సహజ లక్షణం. ఇక తర్వాత చర్మం పగిలిపోవడం కనిపిస్తుంది. తర్వాత బొబ్బలు వస్తాయి. ఉబ్బిన ఎర్రబడిన చర్మానికి దారితీస్తుంది. కావున పెద్దలలో తామరకు కారణమయ్యే విధంగా రకాలు ఉంటాయి. సహజంగా ఎగ్జిమా 50, 60 సంవత్సరాల మధ్య వయసు వారికి కనిపిస్తూ ఉంటుంది.అటువంటి సమయంలో పొడి చర్మ సమస్యలు వస్తుంటాయి. కావున పొడి తామర వారి శరీరంపై కనిపించవచ్చు. ఇది క్రమేపీ తడి తామరగా మారుతుంది.

Skin Care Not all allergies are Eczema Know Some Health Tips

Skin Care Not all allergies are Eczema.. Know Some Health Tips

Skin Care : ఇది ఎగ్జిమా అని ఎలా తెలుసుకోవాలి..

వర్షాకాల సమయంలో తేమ పెరగడం వలన ఈ అలర్జీలు వస్తూ ఉంటాయి దీనివలన ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జిమా నుండి అలర్జీల వరకు ఇన్ఫెక్షన్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి.
తెలియని లక్షణాలలో కొద్దిగా భిన్నంగా ఉంటే కాబట్టి వెంటనే డాక్టర్ను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. ఇది ఒక అంటువ్యాధి దీర్ఘకాలి అలర్జీ. ఇది పొరలు పొరలుగా మరియు దురదతో కూడా ఉంటుంది. సోరియాసిస్ : సోరియాసిస్ అనేది తామర వంటి అలర్జీ కానీ ఇది తామరయితే కాదు. సోరియాసిస్ లో మనం చేతులు మోకాళ్లు తల చర్మంపై అలర్జీలు గమనించవచ్చు. సోరియాసిస్, పులుసుల దురదలు కలిగి ఉంటుంది.

సోరియాసిస్ అనేది ఎక్కువ కాలం ఉండే సమస్య. దీనికి చికిత్స ఉండదు. అలర్జీలు : వాతావరణం మార్పు చెందినప్పుడు చాలామందికి చర్మవ్యాధులు వస్తూనే ఉంటాయి. అలాగే దగ్గు, తుమ్ములు, దురద, ఎర్రటి చర్మం లేదా వాపు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. దద్దుర్లు : ఇది ఒక రకమైన దురద లాంటిది. కొన్ని లక్షణాలు చర్మం యొక్క ఉపరితలంపై ఎరుపు లేదా చర్మం రంగు ఎరుపుగా మారడం, దురద. ఇవి కొన్ని ఆహార అలాగే మందులు లేదా పర్యావరణ వలన వస్తూ ఉంటాయి. అలర్జీలకు వర్షాకాలంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి.. తామర ఏ ఆహార పదార్థాల వల్ల వచ్చేది కాదు.. అయితే మంచి ఫుడ్ తీసుకోవడం వలన తామర మరియు ఇతర అలర్జీలో తగ్గిపోతాయి. స్వీట్లకు వీలైనంతవరకు దూరంగా ఉండటం మంచిది.

అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. తామర ఉన్నవారు గుడ్లు తింటే ఆ ఎలర్జీ ఎక్కువవుతుంది. అయితే కొన్ని ఆహారాలు అలాగే ట్రాన్స్ఫార్ట్స్ ఎర్ర మాంసం వెన్న పాలు ఫాస్ట్ ఫుడ్స్ వీటిని తీసుకోవడం వల్ల అలర్జీలు ఎక్కువ అవుతుంటాయి. అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉన్న ఆహారాలను ఈ బాధితులు తీసుకోవడం వలన వాటిలో ఉన్న ఆహారాలు వీటికి మంచిది. గజ్జి : ఇది చర్మంపై కనిపించని పురుగులేదా పురుగుల వల్ల వచ్చే అలర్జీ ఇది ఎంతో ఇరిటేషన్ను తెప్పిస్తుంది. దీనిని ఎప్పుడు దురద ఉంటుంది ఇది శారీరిక సంబంధం వలన ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి వస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది