Salt : మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే జబ్బులు రావడం గ్యారెంటీ…!
Salt : అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు. అవును.. కూరల్లో ఉప్పు లేకుంటే అస్సలు తినలేం. ఉప్పు ఉంటేనే కాస్తో కూస్తో రుచిగా ఉంటుంది. ఉప్పు లేని కూడా చప్పగా ఉంటుంది. కాసింత ఉప్పు వేస్తే నోటికి రుచి తగులుతుంది. అందుకే.. ప్రతి ఒక్కరు ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు. ప్రతి కూరలో, ప్రతి వంటకంలో ఉప్పును వాడుతుంటారు. నిజానికి.. మనిషికి రోజూ కాసింత ఉప్పు అవసరమే కానీ.. మనం టేస్ట్ పేరుతో రోజూ ఉప్పును ఎక్కువగా లాగించేస్తున్నాం. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు. దాని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ.. అది కేవలం ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్లే అని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎటువంటి వ్యాధులు వస్తాయో ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) – World Health Organization స్పష్టం చేసింది.
Salt : ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏ వ్యాధులు వస్తాయంటే?
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా వచ్చేది గుండె జబ్బులు. గుండెకు సంబంధించిన వ్యాధులన్నీ వస్తాయి. గుండె పోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు అన్నీ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఏర్పడతాయి. అలాగే.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా కూడా శరీరంలోకి ఉప్పు అధికంగా వచ్చి చేరుతుంది. ప్రాసెస్ చేసిన ఏ ఆహారం అయినా సరే.. అందులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఉప్పును ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోవాలి.
Salt : రోజుకు ఎన్ని గ్రాముల ఉప్పు తినాలంటే?
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటోందంటే.. ఒక మనిషి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలట. అది కూర ద్వారా కానీ.. ఇతర ఏ ఆహార పదార్థాల ద్వారా కానీ తీసుకున్నా.. 5 గ్రాములకు మించకూడదు. అంతకు మంచి ఎక్కువ తీసుకుంటే.. పైన చెప్పుకున్న సమస్యలు వచ్చినట్టే. నిత్యం 5 గ్రాములకు మించితే.. భవిష్యత్తులో గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. ప్యాకింగ్ చేసిన చిప్స్ ప్యాకెట్లు, మిక్చర్ ప్యాకెట్లు, బ్రెడ్, ప్రాసెస్డ్ మాంసం, చీజ్ లాంటి వాటిలో సోడియం కంటెంట్ ను ఎక్కువ వాడుతారు. వీలు అయినంత తక్కువగా ఆ ఆహారాన్ని తీసుకుంటూ.. రోజుకు 5 గ్రాములకు మించకుండా ఉప్పును తినాల్సి ఉంటుంది. అలా అయితేనే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే.. లేనిపోని సమస్యలను కేవలం ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది.