Tamarind Seeds Water : చింత గింజల నీరు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamarind Seeds Water : చింత గింజల నీరు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే…!

 Authored By aruna | The Telugu News | Updated on :16 January 2024,12:20 pm

ప్రధానాంశాలు:

  •  Tamarind seeds : చింత గింజల నీరు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే...!

tamarind seeds water : ఎందుకు పనికిరావని ఈ గింజలను పడేస్తూ ఉంటారు. అయితే ఆ గింజలలోనే ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయని ఇటీవల లో అందరికీ తెలిసింది. అవే చింత గింజలు.. ఈ చింత గింజలలో ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతో కీళ్ళు ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందనే పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు చెప్పే ఈ ఒక్క రెసిపీని తయారు చేసుకుని 30 రోజులపాటు క్రమం తప్పక వాడితే కీళ్లు ఎముకలు దృఢంగా తయారవుతాయి.

ప్రారంభ దశలో ఉన్నవారికి ఎటువంటి సమస్య లేని వారికి భవిష్యత్తులో ఆ సమస్య ఏర్పడదు. తయారీ విధానం చింతపండులోని చింత గింజలు సేకరించి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పై పొట్టు తీసి పప్పును ఎండించాలి తర్వాత వాటిని మెత్తగా దంచి పొడి చేసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఒక చెంచా మోతాదుగా నీరు పోసి ఉడికిన తర్వాత పాలు పోసి చక్కర వేసి పాయసంలా చేసుకుని ఉదయం సాయంత్రం సేవించాలి. ఈ విధంగా కొద్దికాలం పాటు చేస్తుంటే కీళ్లు, మోకాళ్ళలో ఆరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడి యెదాతలు స్థితికి చేరుతాయి. ఇది పెద్దగా ఖర్చు లేని కష్టం లేని సులభ మార్గం.

ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్ కీళ్లలో రాడ్లు పెట్టించుకుని తర్వాత బాధపడే ప్రమాదం తప్పుతుంది.. చింతపండు గింజలు ఈ గింజల యొక్క రసం పిత్త ఉత్పత్తిని పెంచడానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. ఇది కొలెస్ట్రాల్లో మరింత తగ్గిస్తుంది. చింతపండు గింజలు చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. చింతపండు గింజలు ప్యాంక్రియాసిన్ రక్షిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతాయి.. చింతపండు విత్తనాల్లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది