Cholesterol : మంతెన చెప్పిన ప్రకారం కొలెస్ట్రాల్ లేని బెస్ట్ వంట నూనె ఇదే…!!
Cholesterol : ప్రస్తుతం చాలామంది గుండె జబ్బులతో అకస్మాత్తుగా మరణిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సమస్య వయసు తరహా లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు గుండె సమస్యలు వస్తూ ఉన్నాయి. సడన్గా చాలామంది చనిపోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. కొలెస్ట్రాల్ సమస్యలు అధికమవడం కూడా దీనికి ఒక కారణం అవుతున్నది. కావున కొలెస్ట్రాల్ లేని నూనె వంటింట్లో ఇప్పుడు చాలా ముఖ్యం. నలభై ఏళ్ల ముందు ఆవనూనె ఎక్కువగా ఉపయోగించేవారట.. ఆ తర్వాత కాలంలో వేరుసెనగ నూనె అందుబాటులోకి వచ్చింది. ఒక నాలుగైదు ఏళ్ల సంవత్సరాల నుంచి సన్ఫ్లవర్ నూనె వాడే వాళ్ళు సైతం విపరీతంగా పెరిగిపోయారు..
ప్రస్తుత కాలంలో రైస్ బ్రాండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. అయినా కానీ గుండె జబ్బులు తగ్గపోగా ఇక ఇంకా అధికమవుతున్నాయి. అయితే మంతెన సత్యనారాయణ రాజు గారు ఏ బ్రాండ్ ఆయిల్ వాడిన సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఏ ఆయిల్ లోను కొలెస్ట్రాల్ ఉండదు. కానీ ఏ బ్రాండ్ ఆయిల్ వాడిన మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి నూనె సహాయపడుతుందని తెలిపారు. మన శరీరానికి ఎంత అవసరం ఉందో అంత కొలెస్ట్రాల్ను లివర్ ఉత్పత్తి చేస్తుంది. మన శరీరానికి రోజుకి 20 గ్రాముల ఇన్ డైరెక్ట్ కొవ్వు కావాలి. అంటే గింజల రూపంలో లోపలికి వెళ్ళేది కానీ నూనె రూపంలో రోజుకి సగటు
60 గ్రాముల డైరెక్ట్ కొవ్వు లోపలికి వెళ్తుంది. దాంతో లివర్ ఎక్కువ మోతాదులో కొవ్వు తయారుచేసి రక్తనాళాల్లోకి పంపించేస్తూ ఉంటుంది. అది కాస్త పేరుకుపోయి ఎన్నో రకాల సమస్యలను కు కారణమవుతున్నది. కావున ఆయిల్స్ బ్రాండ్ మార్చిన గుండె జబ్బు సమస్యలు మాత్రం మారవు అని మంతెన గారు చెప్పారు. అయితే ఆయిల్ కంప్లీట్ గా తగ్గిస్తే తప్ప బ్రాండ్లు మారిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు.. ఆయిల్స్ మానేసి పాల మీద మీగడ తో వంటలను చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఉప్పులేని వంటకాలు తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఈ కొలెస్ట్రాల్ గుండె జబ్బుల సమస్య నుంచి బయటపడవచ్చు.. అని మంతెన రాజుగారు తెలిపారు..