Turmeric : పసుపు ను ఎక్కువగా తీసుకుంటున్నారా… డేంజర్ లో పడట్టే…
ప్రధానాంశాలు:
Turmeric : పసుపు ను ఎక్కువగా తీసుకుంటున్నారా... డేంజర్ లో పడట్టే...
Turmeric : పసుపును ఎక్కువగా వంటకాలలో మరియు పూజాలల్లో వాడుతూ ఉంటాము. అయితే ఈ పసుపులో ఎన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.ఇది గాయాలకు ఒక యాంటీబయటిక్ గా పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే. పసుపు అనేది ఒక మసాలా దినుసు. దీనిని ఎన్నో ఏళ్లుగా వంటకాలలో వాడుతూ ఉన్నాము. దీనితో పాటుగా పసుపును ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వాడుతున్నారు. పసుపు ఇతర జీవన పక్రియలకు తోడ్పడే యాంటీబయోటిక్, క్యాన్సర్ నిరోధక మరియు ఇన్ఫ్లమేష న్ ను నిరోధించి,ట్యూమర్ కలగకుండా ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. దీంతో వ్యాధులతో పోరాడడానికి మరియు మొత్తం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే పసుపును ప్రతినిత్యం తీసుకోవాలి అని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు…
ఈ పసుపు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వటంలో ఎలాంటి సందేహాలు లేవు. అలాగే పసుపును అధికంగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పసుపును అధికంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ప్రమాదం,కాబట్టి మితంగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ పసుపు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీని వాడకం అనేది అధికంగా పెరిగినప్పుడు చెడు ప్రభావాలను కూడా కలిగిస్తుందని అంటున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
కడుపు నొప్పి : పసుపును ఎక్కువగా తీసుకోవడం వలన దాని సున్నితత్వం వలన కడుపు నొప్పి వస్తుంది. అందుకే మితంగా తీసుకోవడం మంచిది..
గ్యాస్ట్రిక్ : పసుపును మన రోజు వారి ఆహారంలో అధికంగా తీసుకోవడం వలన గుండెల్లో మంట, గ్యాస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో గ్యాస్టిక్ సమస్య అనేది అధికంగా పెరిగి మున్ముందు ఎన్నో ప్రమాదాలకు గురిచేస్తుంది..
వికారం : పసుపుతో పాటుగా పసుపు కు సంబంధించిన సప్లిమెంట్లను తీసుకోవడం వలన వికారం అనేది వస్తుంది. కాబట్టి పసుపుని ఎక్కువగా తీసుకోవద్దు అని వైద్య నిపుణులు అంటున్నారు..
బ్లీడింగ్ డిజార్డర్ : ఈ పసుపు అనేది యాంటీ కొగ్యులేంట్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అందువల్ల రక్తస్రావ సమస్యతో బాధపడేవారు పసుపును ఎక్కువగా తీసుకోవద్దు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..