Warm Water : గోరువెచ్చని నీటిలో ఈ నాలుగింటిని కలుపుకొని త్రాగండి.. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Warm Water : గోరువెచ్చని నీటిలో ఈ నాలుగింటిని కలుపుకొని త్రాగండి.. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టండి..!

Warm Water  : చల్లగా ఉండే చలికాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మన భారతీయ వంట గదిలో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడ్డాయి. వీటిని ఆహారం రుచిని పెంచడానికి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేదంలో ఈ నాలుగు పదార్థాలను ఔషధంలా ఉపయోగిస్తారు. ఈ పదార్థాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక సమస్యల నుండి […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Warm Water : గోరువెచ్చని నీటిలో ఈ నాలుగింటిని కలుపుకొని త్రాగండి

  •  శీతాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టండి

Warm Water  : చల్లగా ఉండే చలికాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మన భారతీయ వంట గదిలో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడ్డాయి. వీటిని ఆహారం రుచిని పెంచడానికి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేదంలో ఈ నాలుగు పదార్థాలను ఔషధంలా ఉపయోగిస్తారు. ఈ పదార్థాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక సమస్యల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్క, లవంగాలు , జీలకర్ర, కొత్తిమీర నీటిలో వేసి కలపడం ద్వారా కషాయం లాగా తయారు చేసుకొని తాగితే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో వచ్చే సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు జీలకర్ర, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క నీళ్లలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి.

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఆ నాలుగు పదార్థాలతో చేసిన పానీయాన్ని తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే మన శరీరంలో ఉన్న చెడు వ్యర్థాలను తొలగిపోవాలంటే ప్రతిరోజు ఈ గోరు వెచ్చని కషాయాన్ని త్రాగటం వలన శరీరంలో ఉన్న చెడులన్నీ తొలగిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర , కొత్తిమీర తో కలిపి చేసిన కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గుతారు. ఈ నాలుగు పదార్థాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది