White Rice – Brown Rice : వైట్ రైస్ మంచిదా.. బ్రౌన్ రైస్ మంచిదా… ఏ రైస్ తీసుకుంటే ఆరోగ్య లాభాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

White Rice – Brown Rice : వైట్ రైస్ మంచిదా.. బ్రౌన్ రైస్ మంచిదా… ఏ రైస్ తీసుకుంటే ఆరోగ్య లాభాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  White Rice - Brown Rice : వైట్ రైస్ మంచిదా.. బ్రౌన్ రైస్ మంచిదా... ఏ రైస్ తీసుకుంటే ఆరోగ్య లాభాలు...!

White Rice – Brown Rice : దక్షిణాది ప్రజలకు ముఖ్యమైన ఆహార ధాన్యం బియ్యం. రోజు తీసుకునే ఆహారంలో అన్నం లేకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు రోజు గడవదనటం కాదు.. సంప్రదాయ బద్ధంగా సేంద్రియ ఎరువులతో పండించే ధాన్యంతో లభించే బియ్యాన్నే అందరు వినియోగించేవారు. సన్నగా మార్చివేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ తినటానికి ఏ రకం బియ్యం మంచివి.. బ్రౌన్ రైస్ అన్నం తినటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో ఒకప్పుడు వేలాది రకాల బియ్యం పండించే వారు..అయితే మారిన జీవన విధానం కారణంగా 30 రకాలను పండించే వారి పోయారు. పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉత్పత్తిని పెంచడానికి రసాయన ఎరువులను వినియోగించి సంకరజాతి వంగడాలతో ఉత్పత్తి పెంచే దిశగా అడుగులు పడ్డాయి.

ఈ క్రమంలో పండించిన పంటకు కూడా సరికొత్త పద్ధతులను వినియోగించి బియ్యం పప్పులకు పాలీసులు చేయడం వంటి ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ తరహా పాలిష్ ప్రక్రియలో బియ్యం లోని పోషకాలు చాలా వరకు తొలగిపోతాయి. చూడ్డానికి అందంగా కనిపించే ఈ వైట్ రైస్ తో పోలిస్తే దంపుడు బియ్యం లో చాలా పోషక విలువలు ఉన్నాయి. దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ అంటారు.వీటిలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ముడి బియ్యాన్ని అన్నంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుపు పడుతుంది. బియ్యాన్ని పాలిష్ వేసి ఆకర్షణీయంగా తయారు చేసే పద్ధతిలో వాటిలోని జీవపదార్థం ఆరోగ్య రక్షణకు ఎంతగానో అవసరమైన బి కాంప్లెక్స్ విటమిన్లు బయటకు వెళ్ళిపోతున్నాయి.

రైస్ లో ఉండి విలువైన ఔషధాలను వదిలేసి కేవలం పనికిరాని వస్తువులే తింటూ అన్నం తింటున్నామన్న భావనతో ఉంట్టున్నాము. బియ్యం వ్యాపారులు వివిధ రకాల బ్రాండ్లతో వినియోగదారులను మోసగిస్తున్నారు. బియ్యం కొనడానికి ముందు బియ్యం సంచిపై ఫైబర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, సెలీనియంలో ఎంత పాలల్లో ఉన్నాయో చూసి మరీ కొనండి. లేకపోతే ఆరోగ్య సమస్యలను కొని ఇంటికి తీసుకుని పోతున్నట్టే అని గుర్తు ఎరగండి. దంపుడు బియ్యం అన్నం కంటికి వింపుగా ఉండదు. కానీ ఒంటికి మాత్రం కచ్చితంగా మంచిదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే దంపుడు బియ్యం వాడటమే ఉత్తమం అని సెలవిస్తున్నారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది