Women : ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టకుడదా ?కొడితే అరిష్టమా…!
Women : హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి శుభకార్యానికి కొబ్బరికాయ కొడుతుంటాం.. అంతేకాదు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడి ముందు కొబ్బరికాయలు కొడుతుంటారు. ప్రస్తుతం చాలా ఆలయాల్లో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు. అయితే మహిళలు కొబ్బరికాయలు కొట్టకూడదని ఎందుకంటారు.. పూజా కార్యక్రమాల్లో దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయలను ఎందుకు కొట్టకూడదు. దీని వెనుక అసలు కథ ఏంటో తెలుసుకుందాం. కొబ్బరికాయ లేదా టెంకాయ భారతదేశంలో ఈ కొబ్బరికాయలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అందుకే ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందుగా కొబ్బరికాయ కొట్టి అంతా మంచే జరగాలని కోరుకుంటూ కొడతారు. అయితే ఎక్కువ శాతం మనకు గుళ్ళలో గోపురాలలో అలాగే ఎక్కడైనా గాని టెంకాయలు కొట్టే ప్రదేశంలో మగవారు ఎక్కువగా కోరుతుంటారు. చాలా తక్కువ ప్రదేశంలో మాత్రమే స్త్రీలు టెంకాయలను కొడుతూ ఉంటారు.
హిందువులు చాలా వరకు స్త్రీలను కాకుండా పురుషులను కొబ్బరికాయ కొట్టమని చెబుతూ ఉంటారు. కొబ్బరికాయను హిందూ మతంలో చాలా పవిత్రమైన భావిస్తారు. కొబ్బరి నీరు చంద్రుని చిహ్నంగా ఉంది. దాన్ని దేవునికి సమర్పించడం వల్ల సుఖం, శ్రేయస్సు లభిస్తాయి. అదే సమయంలో ఇది దుఃఖం బాధలను కూడా తొలగిస్తుంది. స్త్రీలకు కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదు అన్న విషయానికి వస్తే.. హిందూ మతంలో మహిళలు కొబ్బరికాయలు పగలకొట్టడం నిషేధించబడింది. ఎందుకంటే కొబ్బరి ఒక విత్తనం. స్త్రీలు సంతానానికి కారకులు వారు ఒకే విత్తనం నుంచి సంతానాన్ని కలిగి ఉంటారు. అందుకే స్త్రీలు ఎప్పుడు కొబ్బరి కాయలు పగలకొట్టరు.
మహిళలు కొబ్బరికాయ పగలకొడితే వారి పిల్లల జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. హిందూ మతంలో కొబ్బరికాయ అత్యంత మతపరమైన ప్రాముఖ్యత ఉంది. విష్ణువు తల్లి లక్ష్మి భూమిపై కొబ్బరి చెట్లను నాటినట్లు చెబుతారు. కొబ్బరికాయ విష్ణువు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి దీన్ని చాలా పూజా విధానములో ఉపయోగిస్తారు.. అయితే భారత దేశంలో హిందువులు కొన్ని ప్రదేశాలలో మహిళలు కొబ్బరికాయలు కొట్టరు. చాలా తక్కువగా మాత్రమే కొడుతుంటారు. కొబ్బరికాయ కొట్టడం అనేది అహంకారాన్ని తొలగించేదిగా సూచిస్తుంది. అంతేకాదు కొబ్బరికాయలు కొట్టడానికి బలం అవసరం. స్త్రీలతో పోలిస్తే పురుషులు బలవంతులని ఆ నాటి కాలంలో భావించారు. అలా కొబ్బరి కాయలను పురుషులు మాత్రమే కొట్టేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు మహిళలు కూడా పురుషులతో సమానం అనే రోజులు వచ్చాయి. దీంతో ఇప్పటికే చాలా ఆలయాల్లో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు.
మహిళలు కొబ్బరికాయలు పగలకొట్టకూడదని ప్రత్యేక నియమం కాని నిషేధం కానీ లేదు. చాలా దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయ కొట్టడానికి తప్పుగా పరిగణించదు. మతపరమైన వేడుకల్లోనూ స్త్రీలు కొబ్బరికాయ కొట్టడానికి అనుమతిస్తున్నారు. ఒకప్పుడు స్త్రీలు కొబ్బరికాయ కొట్ట వద్దన్నది ఆచారం. కానీ ఇప్పుడు సమానత్వం అనే అంశం ప్రతిచోట అమలు అవుతుండడం వల్ల కొబ్బరికాయ కొట్టడం అనే విషయంలో స్త్రీ పురుష భేదం ఇప్పుడు చాలా చోట్ల లేదు…