Health Benefits : తుమ్మి మొక్క తో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఈ చిన్ని మొక్కతో వ్యాధులన్నింటికీ చెక్..
Health Benefits : మనం నిత్యం రోడ్ల పక్కన, ఉండే అలాగే మనం ఉండే ఆవరణలో ఎన్నో రకాల మొక్కలను చూస్తూనే ఉంటాం. వాటిల్లో చాలా మొక్కలు ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధంలా ఉపయోగపడుతున్నాయి. అయితే వీటిని ఎలా వినియోగించాలో తెలియక మనం చాలా నష్టపోతున్నాం. ఔషధాలుగా మనకి సహాయపడే మొక్కలలో తుమ్మి మొక్క కూడా ఒకటి. ఇది వినాయక చవితి నాడు ప్రతి ఇంట్లో తప్పక కూరల చేస్తూ ఉంటారు. అయితే తుమ్మి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకి వచ్చే ఎన్నో వ్యాధులను తగ్గించడానికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. తుమ్మి చెట్టును వాడడం వలన కలిగే ఉపయోగాలు
ఏంటో ఏ ఏ వ్యాధులకు గొప్ప ఔషధంలా పనిచేస్తుందో. వ్యాధులను నయం చేయడానికి దీనిని ఏ విధంగా వినియోగించాలి అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.. శరీరంలో నొప్పులు వాపులు ఉన్నచోట ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకులను దంచి కట్టుగా కట్టడం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో కొద్దిసేపు ఉంచుకొని పుక్కిలించి ఉమ్మడం వలన నోటి పూత కూడా తగ్గిపోతుంది. తాజా తుమ్మి ఆకుల రసాన్ని రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాలు వేసుకోవడం వల్ల సైనసైటిస్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
తేలు పాము విషాన్ని హరించడంలోని ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది. తుమ్మి మొక్క ఆకులను మెత్తగా దంచి రసాన్ని తీసుకోవాలి.ఈ రసాన్ని తేలు లేదా పాము కుట్టిన ప్రదేశంలో వేయాలి. తేలు లేదా పాము కుట్టిన మనిషికి కూడా ఈ రసాన్ని టీ స్పూన్ చొప్పున తాగించాలి. అలాగే దంచిన ఆకులను తేలు లేదా పాము కుట్టిన చోట ఉంచి కట్టుగా కట్టడం వల్ల తేలు కాటు పాము కాటు ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది. ఈ తుమ్మి మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మొక్క ఆకులతో చేసిన కూరను తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది.