Reverse Walking : రివర్స్ వాకింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Reverse Walking : రివర్స్ వాకింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు…

 Authored By aruna | The Telugu News | Updated on :19 May 2023,7:00 am

Reverse Walking : నడక అనేది ఆరోగ్యానికి ఉత్తమమైన వ్యాయామం.. ప్రతిరోజు కొన్ని నిమిషాలు నడవడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.. అలాగే రాత్రి భోజనం తర్వాత కొన్ని నిమిషాలు వాకింగ్తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. నిత్యం ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో వ్యాయామలు చేస్తూ ఉండవచ్చు.. కానీ మీరు రివర్స్ వాకింగ్ ఎప్పుడైనా ట్రై చేశారా.. రివర్స్ వాకింగ్లో అడుగులు వెనకకి వేయడం ఉంటుంది.. చిన్నతనంలో మీరు సరదాగా ఆటల్లో భాగంగా ఇలా సరదాగా రివర్స్ వాకింగ్ చేసి ఉంటారు.. ఈ వ్యాయామం శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..

Reverse Walking : మోకాలి పై ఒత్తిడి కలగదు…

చాలామంది మోకాలు నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. నడిచేటప్పుడు మోకాళ్ళపై ఒత్తిడి వల్ల నొప్పి కలుగుతుంది. అయితే రివర్స్లో నడవడం వల్ల మోకాళ్ళపై ఒత్తిడి తగ్గిపోతుంది. డాక్టర్ తో సలహా తీసుకొని ఈ వ్యాయామం చేయాలి..

Reverse Walking

Reverse Walking

కాళ్ల కండరాలు బలపడతాయి…

రివర్స్ వాకింగ్ రెండు కాళ్లల్లోని కండరాలను బలపరుస్తుంది. వెనక్కి నడవడం వలన కండరాలు అధికంగా సాగుతాయి.. అలాగే ఈ వ్యాయామం చేసేటప్పుడు కాళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఏకాగ్రతతో ఉండేందుకు ఉపయోగపడుతుంది…

రివర్స్ వాకింగ్ మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.. వెనకకు నడిచేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. మెదడు దృష్టి కేంద్రీకరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలోని ఇతర అవయవాలు, మెదడు సమన్యయముయంతో పనిచేస్తాయి.

వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది…

రివర్స్ వాకింగ్ కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వైద్యుని సలహా తీసుకున్న తర్వాత ఈ వ్యాయామం చేయవచ్చు…

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది